ETV Bharat / international

ట్రంప్ అభిశంసన: సెనేట్​లో ఆరుగురు రిపబ్లికన్ల మద్దతు - గ్రాఫిక్​ వీడియోతో ట్రంప్​ అభిశంసనపై విచారణ

అగ్రరాజ్యంలోని సెనేట్​లో మాజీ అధ్యక్షుడు ట్రంప్​ అభిశంసనపై విచారణ వీడియో ప్రదర్శనతో అధికారికంగా ప్రారంభమైంది. అయితే... విచారణను రాజ్యాంగబద్ధంగా నిలిపివేసేందుకు యత్నించిన ట్రంప్​ బృందం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆరుగురు రిపబ్లికన్లు... డెమొక్రాట్లకు మద్దతుగా నిలవడం గమనార్హం.

Trump's impeachment trial in senate
ట్రంప్ అభిశంసనపై విచారణకు మద్దతుగా ఆరుగురు రిపబ్లికన్లు
author img

By

Published : Feb 10, 2021, 7:36 AM IST

అమెరికా సెనేట్​లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో​ ఆభిశంసన ప్రక్రియ మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో ఓటమి అంగీకరించని ట్రంప్ 'ఫైట్​ లైక్ హెల్' అంటూ తన మద్దతుదారులను ప్రేరేపించి క్యాపిటల్​ హింసాకాండకు పాల్పడినట్లు ఓ గ్రాఫిక్ వీడియోను ప్రదర్శించారు. క్యాపిటల్​ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఈ వీడియోలు చూపించారు.

తొలుత విచారణను నిలిపివేసేందుకు యత్నించిన ట్రంప్ బృందం విఫలమైంది. ట్రంప్​ అభిశంసనపై విచారణ జరిపేందుకు 56 మంది సెనేటర్లు అంగీకరించగా 44 మంది నిరాకరించారు. ఈ ప్రక్రియలో భాగంగా... మాజీ అధ్యక్షుడి అభిశంసనపై విచారణ రాజ్యంగబద్ధమే అని తెలిపి ఆరుగురు రిపబ్లికన్లు... డెమొక్రాట్లకు మద్దతుగా నిలవడం గమనార్హం. ట్రంప్​ విచారణను నిలిపివేసేందుకు 67 మంది సెనేటర్ల అంగీకారం అవసరం.

ఈ నేపథ్యంలో క్యాపిటల్​ దాడి విషయంలో మాజీ అధ్యక్షుడి పాత్రపై పూర్తి స్థాయి వివరాలను బహిర్గతం చేస్తామని డెమొక్రాట్లు తెలిపారు.

ఇదీ చదవండి:సెనేట్​ ముందుకు ట్రంప్​ అభిశంసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.