ETV Bharat / international

'రైతు'కు మద్దతుగా అమెరికా సిక్కుల ర్యాలీలు - jakara movement

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అమెరికాలోని భారతీయ సిక్కులు మద్దతు పలికారు. శాంతియుతంగా అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు.

Sikh-Americans hold protest rallies in US cities against farm laws in Indiav
రైతు ఉద్యమానికి మద్దతుగా అమెరికాలో సిక్కుల నిరసనలు
author img

By

Published : Dec 6, 2020, 3:02 PM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు అమెరికాలోని భారతీయ సిక్కులు మద్దతు పలికారు. కాలిఫోర్నియా శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ఎదుట వందల సంఖ్యలో సిక్కులు నిరసనలు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను తొలగించాలని, ఇవి రైతులను పేదరికంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలతో కార్పొరేట్​ సంస్థలకు భారత ప్రభుత్వం సర్వాధికారాలు కట్టబెట్టిందని ఆరోపించారు.

"ఏ దేశానికైనా రైతులే జీవనాధారం. మన జీవనాధారాన్ని మనమే కాపాడుకోవాలి. అమెరికావ్యాప్తంగా ఉన్న భారతీయులు ఇవాళ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు."

--గురిందర్​ సింగ్ ఖల్సా, ఇండో-అమెరికన్​.

అంతకు ముందురోజు వాషింగ్టన్​ డీసీలోని భారత దౌత్యకార్యాలయం ఎదుట చికాగో రాష్ట్రానికి చెందిన సిక్కులు నిరసనలు తెలిపారు.

"నో ఫార్మర్స్​, నో ఫుడ్​", "సేవ్ ది​ ఫార్మర్స్​" అనే నినాదాలతో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు.

'శాంతియుత నిరసనలతో భారత ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపుతామని, రైతులకు మద్దతు తెలపాల్సిన బాధ్యత మనందరిదని' అమన్​దీప్ సింగ్​ హుండాల్​ తెలిపారు.

జకారా ఉద్యమనాయకుల సంఘీభావం

అమెరికాలోని తీరప్రాంతాల్లో ఆదివారం నిరసనలు నిర్వహించనున్నారు. జకారా ఉద్యమ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 'పంజాబ్​లో ​ తరతరాల నుంచి వ్యవసాయం జీవనోపాధిగా ఉంటోంది. వ్యవసాయం లేకపోతే పంజాబ్​లో లక్షల మందికి ఉపాధి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపాల'ని జకారా ఉద్యమ నాయకులు తెలిపారు.

" ఈ(రైతుల నిరసనలు) ఘటనలతో మేం తీవ్రమైన కలత చెందాం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మేం మద్దతు ఇస్తున్నాం."

--నైనాదీప్​ సింగ్​, జకారా ఉద్యమ అధ్యక్షుడు.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్​, హరియాణాకు చెందిన వేల మంది రైతులు 11 రోజులుగా దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమని అభివర్ణించారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, వారికి అనేక అవకాశాలను కల్పిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.