ETV Bharat / international

అగ్రరాజ్యంలో టీకాల కొరత.. అదే కారణమా! - us corona vaccine

అమెరికాలో కొవిడ్​ టీకాకు కొరత ఏర్పడింది. అందుబాటులోకి రానున్న డోసులపై రాష్ట్రాలకు సరైన అంచనా లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు అగ్రరాజ్యం 3.8 కోట్ల డోసులను రాష్ట్రాలకు అందించింది.

us, america, vaccine shortage
అగ్రరాజ్యంలో టీకాల కొరత !
author img

By

Published : Jan 22, 2021, 11:07 AM IST

అమెరికాలో కొవిడ్​ టీకా పంపిణీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. టీకా కొరత కారణంగా పంపిణీ కార్యక్రమాన్ని కొన్ని రాష్ట్రాల్లో వాయిదా వేయగా.. మరి కొన్ని చోట్ల తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. కాలిఫోర్నియా, ఓహియో, వెస్ట్​ వర్జీనియా, ఫ్లోరిడా, హవాయి రాష్ట్రాల్లో పరిస్థితి అద్వానంగా మారింది. టీకా కొరతపై ఆ రాష్ట్రాలు ఇప్పటికే హెచ్చరించాయి. న్యూయార్క్​లో టీకాల పంపిణీపై ఆ రాష్ట్ర మేయర్ స్పందించారు.

"రాష్ట్రంలో టీకా పంపిణీని నిలిపివేయలేదు, కానీ పెరుగుతున్న డిమాండ్​ను చూస్తే ప్రస్తుతం ఉన్న డోసులు సరిపోవు. కొరత వల్ల టీకా పంపిణీ వాయిదా వేయాల్సి వస్తోంది. ఇది దురదృష్టకరం."

-బిల్​ దే బ్లాసియో, న్యూయార్క్ మేయర్

ఎందుకీ కొరత?

మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు రెండు వారాలుగా 65 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీని రాష్ట్రాలు విస్తృతం చేశాయి. అయితే డిమాండ్​ పెరగడం వల్ల ఇప్పుడు కొరత ఏర్పడింది. ఎన్ని డోసులు అందుబాటులోకి రానున్నాయి అనే విషయంపై రాష్ట్రాలు సరైన అంచనా వేయలేకపోయాయని ఆరోగ్య శాఖ గత వారం వెల్లడించింది. ఇంకా పూర్తిస్థాయిలో డోసులు అందకుండానే టీకా పంపిణీ చేపట్టడం వల్ల ఈ సమస్య వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని వారాల్లో మళ్లీ సరఫరా పుంజుకుంటుందని స్పష్టం చేశారు. అంచనా లేకపోవడం వల్ల పలు రాష్ట్రాల్లో ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఇప్పటి వరకు..

అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు 3.8 కోట్ల​ డోసులను రాష్ట్రాలకు అందించింది. అందులో 1.75 కోట్ల డోసులను రాష్ట్రాలు వినియోగించాయి. 24 లక్షల​ మంది ప్రజలు రెండు డోసుల్లో టీకాను వేయించుకున్నారు.

ఇదీ చదవండి : బైడెన్​కు అమెరికా మాజీ అధ్యక్షుల వీడియో సందేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.