Shooting in Mexico: మాదక ద్రవ్యాలను విక్రయించే ఇంట్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మెక్సికో నగరానికి తూర్పున ఉన్న ప్యూబ్లా రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున దాడి జరిగిందని అధికారులు చెప్పారు. బాధితులు తమ రాష్ట్రానికి చెందినవారు కాదని తెలిపారు.
దాడి జరిగిన ప్రదేశం డ్రగ్స్ వ్యాపారం చేసే స్థలమని ప్యూబ్లా గవర్నర్ మిగ్యుల్ బార్బోసా తెలిపారు. రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పైప్‌లైన్‌ల నుంచి ఇంధనాన్ని దొంగిలించే ముఠాలకు ప్యూబ్లా చాలా కాలంగా నిలయంగా మారింది.
ఇదీ చదవండి: పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి