అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతితో మొదలైన ఆందోళనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది దుకాణాలపై దాడి చేసి కొల్లగొడుతున్నారు. ఆదివారం రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలోని పలు దుకాణాలు లూటీ చేసిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
సుమారు 20కిపైగా నగరాల్లోని దుకాణాల్లో దొంగలు చొరబడి.. చేతికందిన వస్తువులను దోచుకెళ్లారు. చెప్పులు, బట్టలు, సెల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఎత్తుకెళ్లారు.
పోలీసులు వచ్చినప్పటికీ..
మాన్హటన్లోని సోహో ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున.. కొంత మంది గుంపులుగా వచ్చి ఖరీదైన భవనాల్లోకి దూసుకెళ్లారు. రోలెక్స్, చానెల్ తదితర షాపుల్లోకి వందలాది మంది చొరబడి.. చేతికందిన వస్తువులను దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నప్పటికీ.. ఈ దోపిడీని ఆపలేకపోయారు.