భారత్లో పర్యటక రంగం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఏటా కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్కు పర్యటకులుగా పంపాలని కోరారు.
హౌడీ-మోదీ కార్యక్రమానంతరం హ్యూస్టన్లో ఎటర్నల్ గాంధీ మ్యూజియం శంకుస్థాపన శిలాఫలం ఆవిష్కరణ, గుజరాతీ సమాజ్ కేంద్రం, సిద్ధి వినాయక ఆలయం ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరయ్యారు. తర్వాత ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించారు.
"నా కోసం మీరు ఏదైనా చేస్తారా? ఇది చిన్న విజ్ఞాపన మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు ఇది చెబుతున్నాను. ప్రతి సంవత్సరం మీలో ప్రతి ఒక్కరు కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్కు పర్యటకులుగా పంపాలనే నిర్ణయం తీసుకోండి."
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.
.
-
PM @narendramodi has a request for the Indian diaspora. Know what it is... pic.twitter.com/RTPYLwjDaH
— PMO India (@PMOIndia) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM @narendramodi has a request for the Indian diaspora. Know what it is... pic.twitter.com/RTPYLwjDaH
— PMO India (@PMOIndia) September 22, 2019PM @narendramodi has a request for the Indian diaspora. Know what it is... pic.twitter.com/RTPYLwjDaH
— PMO India (@PMOIndia) September 22, 2019
ఇదీ చూడండి: అధ్యక్షుడిగా ట్రంప్ మరోమారు గెలవాలి: మోదీ