ETV Bharat / international

'రైతుల అంశంపై మోదీతో మాట్లాడండి' - ప్రధాని మోదీ

రైతు నిరసనలపై భారత్​ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికాలో ఇద్దరు సెనేటర్లు ఆ దేశ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. కర్షకుల విషయంపై బైడన్​ ప్రభుత్వం ప్రధాని మోదీతో మాట్లాడాలని కోరారు.

Senators ask Blinken to raise farmers issue, say Indians will determine path ahead on new laws
'ఆ విషయం గురించి మోదీతో మాట్లాడండి'
author img

By

Published : Mar 19, 2021, 1:10 PM IST

కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులపై భారత ప్రభుత్వం ​వ్యవహరిస్తున్న తీరుపై విచారం వ్యక్తం చేశారు ఇద్దరు అమెరికా సెనేటర్లు. ఈ విషయంపై అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​కు లేఖ రాశారు. రైతుల అంశంపై బైడన్ ప్రభుత్వం.. ప్రధాని మోదీతో మాట్లాడాలని కోరారు.

అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్​, సెనేటర్​ బాబ్​ మేనెందేజ్​, చుక్​ షూమర్​ గురువారం రోజున బ్లింకెన్​కు లేఖ రాశారు. శాంతియుత నిరసనలు, భావప్రకటన స్వేచ్ఛ వంటి అంశాలను లేవనెత్తాలని సూచించారు. అయితే.. దీనిపై బ్లింకెన్​ ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

చైనాతో భేటీపై 20 మంది లేఖ..

అలస్కాలో జరుగుతున్న అమెరికా-చైనా మధ్య తొలి సమావేశంపై వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బ్లింకెన్​కు గురువారం 20 మంది చట్టసభ్యులు లేఖ రాశారు. తైవాన్​, హాంగ్​కాంగ్​లో మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంపై దూకుడు, పొరుగు దేశాలతో డ్రాగన్​ వైఖరిని ఎండగట్టాలని సూచించారు.

ఇదీ చదవండి: 'బైడెన్​జీ.. ఆ విషయంలో భారత్​కు మద్దతివ్వండి
'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.