సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. సరిహద్దు గోడ నిధుల కోసం ట్రంప్ విధించిన అత్యవసర పరిస్థితిని తిరస్కరించడానికి రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్న సెనేట్ సిద్ధపడుతోంది.
ఎమర్జెన్సీని రద్దు చేయాలని ఇప్పటికే డెమోక్రాట్లు అధికంగా ఉండే ప్రతినిధుల సభ తీర్మానించింది. దీనిపై రానున్న వారాల్లో ఎగువసభలో ఓటింగ్ జరిగే అవకాశముంది.
53-47తో సెనేట్‌లో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారు. వారిలో నలుగురు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. మరికొందరు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోయినా అత్యవసర పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు.
మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం నిధుల సమకూర్చడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. అక్రమ వలసలను నియంత్రించేందుకుసరిహద్దు గోడఉపయోగపడుతుందని ట్రంప్ వాదన.