ETV Bharat / international

సూపర్​ స్ప్రెడర్ల ద్వారా కరోనా వ్యాప్తి ఇలా..! - corona latest updates

తుమ్ములపై పరిశోధనల ద్వారా కరోనా వైరస్​ ఎలా వ్యాప్తి చెందుతుందో అమెరికా శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ముక్కు సాఫీగా ఉంటే తుమ్ము ద్వారా నోటి నుంచి వచ్చే తుంపర్ల వేగం దూరం పరిమితంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వెలుపలికి రావడానికి దానికి స్పష్టమైన దారి ఉండటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.

scientists have discovered how the corona virus can be spread through sneezing
సూపర్​ స్ప్రెడర్ల ద్వారా కరోనా వ్యాప్తి ఇలా..!
author img

By

Published : Nov 21, 2020, 7:49 AM IST

కొవిడ్-19 వంటి వ్యాధుల బారిన పడినవారిలో కొందరి నుంచి ఆ వైరస్ ఎక్కువ మందికి వ్యాపిస్తుంటుంది అలాంటివారిని సూపర్ స్ప్రెడర్స్ గా పేర్కొంటారు. అందుకు దారితీసే పరిస్థితులను అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం వారు భిన్నరకాల వ్యక్తుల్లో తుమ్ములను సిమ్యులేట్ చేసి చూశారు. తుమ్ము, దగ్గు సమయంలో వైరస్​తో కూడిన తుంపర్ల వల్లే కరోనా ఇన్ఫెక్షన్ ప్రధానంగా వ్యాప్తి చెందుతోందని అమెరికాలోని 'సెంటర్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' ఇప్పటికే పేర్కొంది. ఈ తుంపరు ప్రయాణించే దూరంపై ప్రభావం చూపే అంశాలను తెలుసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని పరిశోధనలో పాలుపంచుకున్న మొజేల్ కింజెల్ చెప్పారు. మానవ శరీరంలో సంక్లిష్టమైన డక్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. నోటి నుంచి వెలువడే ప్రవాహాలను అది అడ్డుకుంటుందని. ఆ తుంపర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా నిలువరిస్తుందన్నారు.

ఎలాంటి అవరోధాలు లేకుండా ముక్కు సాఫీగా ఉంటే. తుమ్ము ద్వారా నోటి నుంచి వచ్చే తుంపర్ల వేగం దూరం పరిమితంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వెలుపలికి రావడానికి దానికి స్పష్టమైన దారి ఉండటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. జలుబు వంటి కారణాల వల్ల నాసిక రంధ్రాలు బిగుసుకుపోతే తుమ్ము జయటకు వచ్చేందుకు ఉన్న మార్గం చాలా పరిమితంగా ఉంటుందన్నారు. అలాంటి సందర్భాల్లో నోటి నుంచి వచ్చే తుంపర్లు వేగంగా దూసుకొస్తాయని చెప్పారు. అవి ఎక్కువ దూరం పయనిస్తాయని పేర్కొన్నారు. పళ్లు కూడా తుమ్ముల నిష్క్రమణ మార్గాన్ని కుంచింపచేస్తాయని తెలిపారు. అందువల్ల తుంపర్లు ఎక్కువ దూరం వెళతాయన్నారు.

మొత్తం మీద ముక్కు బిగుసుకుపోయిన, పూర్తి స్థాయిలో పళ్ళు కలిగిన వ్యక్తి నుంచి వచ్చే తుమ్ము 60 శాతం ఎక్కువ దూరం పయనిస్తుందని తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: స్మార్ట్​ వాచీలతో కరోనాను ముందే కనిపెట్టొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.