ETV Bharat / international

స్మార్ట్​ఫోన్​తో కొవిడ్​ పరీక్ష-15 నిమిషాల్లో ఫలితం! - స్మార్ట్​ఫోన్​ ఆధారంగా లాలాజల పరీక్ష

కొవిడ్​-19ని గుర్తించే సరికొత్త పరీక్ష విధానాన్ని కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు. స్మార్ట్​ఫోన్​ ఆధారంగా లాలాజలాన్ని పరీక్షించి కరోనా ఉనికిని నిర్ధరించారు. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫలితాన్ని వెల్లడిస్తుండటం విశేషం.

Smart Phone test for covid
స్మార్ట్​ఫోన్​తో కొవిడ్​ పరీక్ష
author img

By

Published : Dec 13, 2020, 8:11 AM IST

స్మార్ట్​ఫోన్​ ఆధారంగా లాలాజలాన్ని పరీక్షించి కొవిడ్​-19 ఉనికిని నిర్ధరించే సరికొత్త పరీక్ష విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రయోగశాలతో పనిలేకుండా, కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫలితాన్ని వెల్లడిస్తుండటం విశేషం. 'టులానె యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్'​ చేపట్టిన ఈ పరిశోధన వివరాలను 'సైన్స్​ అడ్వాన్సెస్' పత్రిక అందించింది.

పరిశోధకులు స్మార్ట్​ఫోన్​కు ఫ్లోరోసైన్స్​ మైక్రోస్కోప్​ను అనుసంధానించారు. ఇందుకు వారు 'సీఆర్​ఐఎస్​పీఆర్​/కాస్​ 12ఎ మాలిక్యూల్​ ఎస్సే చిప్'​ను వినియోగించారు. లాలాజల నమూనాల్లో వైరస్​ తీవ్రతను ఈ మైక్రోస్కోప్​ అత్యంత నిశితంగా పరిశీలిస్తుంది. కాగా, ఈ విధానంలో మొత్తం 12 మంది కొవిడ్​ బాధితులకు, ఆరుగురు ఆరోగ్యవంతులకు పరీక్షలు నిర్వహించగా.. సరిగ్గా ఆర్టీ-పీసీఆర్​ విధానంలో మాదిరే ఫలితాలు వచ్చాయి.

" మేము రూపొందించిన స్మార్ట్​ఫోన్​ ఆధార సాంకేతికతతో కొవిడ్​ పరీక్షలను విస్తృత స్థాయిలో నిర్వహించే వీలుంది. ఎక్కడికక్కడ కరోనా కేసులను సత్వరం గుర్తించి, మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇదెంతో భద్రమైన, సులభమైన, నమ్మదగ్గ పరీక్ష విధానం "

- పరిశోధకులు.

ఇదీ చూడండి:సోమవారం నుంచే అమెరికాలో టీకా పంపిణీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.