ETV Bharat / international

'క్యాపిటల్'​పై దాడి చేసిన వారి ఉద్యోగాలపై వేటు!

క్యాపిటల్​ భవనంపై ట్రంప్​ మద్దతుదారులు చేసిన దాడి.. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. జో బైడెన్​ అధ్యక్ష ఎన్నిక ధ్రువీకరణ ప్రక్రియను నిరసనకారులు అడ్డుకున్న తీరు అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ దాడిలో పాల్గొన్న వారికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులెవరైనా ఈ ఘటనలో ఉన్నట్లు తేలితే వారి ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధపడుతున్నాయి.

face company boycotts after storming Capitol
'క్యాపిటల్'​పై అరాచకం- ఉద్యోగాలకు ఎగనామం!
author img

By

Published : Jan 9, 2021, 3:30 PM IST

అమెరికా ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి క్యాపిటల్​ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి ప్రస్తుతం ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అమెరికాలోని వివిధ కంపెనీలు.. ఆ నిరసనకారులను గుర్తించి ఉద్యోగాల్లో నుంచి ఉద్వాసన పలుకుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో గుర్తించి..

మేరీలాండ్​లోని ఓ ప్రచురణ సంస్థ.. తమ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి క్యాపిటల్​ భవనం వద్ద బుధవారం సంస్థ గుర్తింపు కార్డు ధరించి తిరుగుతున్న ఫొటోలను చూసింది. అనంతరం ఆ మరుసటి రోజు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. క్యాపిటల్​పై దాడిలో పాల్గొన్న చాలా మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోని ఫొటోల్లో తమ కంపెనీ ఉద్యోగస్థులెవరైనా ఉన్నట్లు తేలితే.. వారి ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఇతరుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే ప్రమాదకరమైన ప్రవర్తన ఉన్న వ్యక్తులకు తమ సంస్థలో ఉపాధి కల్పించలేమని నేవిస్టర్​కు చెందిన ఓ ప్రచురణ సంస్థ పేర్కొంది. నెటిజన్లు కూడా వారిని గుర్తించి ఉద్యోగాల్లో నుంచి తొలగించాలని సదరు కంపెనీలను డిమాండ్​ చేస్తున్నారు.

ఉన్నతస్థాయి వారు కూడా..

అయితే ఈ అల్లర్లలో చిరుస్థాయి ఉద్యోగులే కాకుండా.. ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. కాజెన్సియా సంస్థ సీఈఓ బార్డ్​లీ రక్​స్టేల్స్.. అల్లర్లలో పాల్గొన్నందున కంపెనీ యాజమాన్యం అతడిని సెలవులపై ఉంచింది. అతని అభిప్రాయాలతో కంపెనీకి సంబంధం లేదని ప్రకటించింది. ఈ ఘటనలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. జరిగినదానికి అతడు క్షమాపణలు కోరాడు. కానీ, రక్​స్టేల్స్​ ప్రవర్తనను అతని కంపెనీ యాజమాన్యం మాత్రం అంగీకరించలేదు.

వ్యాపార సంస్థల రివ్యూలు ఢమాల్​!

అల్లర్లలో పాల్గొన్నట్లు ఆరోపణలు రాగా.. క్వీవ్​ల్యాండ్​లోని ఓ పాఠశాల ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఓర్లాండోకు సమీపంలోని ఓ అగ్నిమాపక శాఖ ప్రతినిధి.. తమ ఉద్యోగుల్లో ఒకరు అల్లర్లలో పాల్గొన్నట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. యెల్ప్​ అనే ఆన్​లైన్ రివ్యూ సంస్థ.. అల్లర్లలో పాల్గొన్న వ్యక్తులకు సంబంధించిన ఓ 20 వ్యాపార సంస్థలను ప్రత్యేకంగా విభజించింది. కడ్స్​ అనే ఫ్లవర్​ షాప్​ యజమాని తన ఫేస్​బుక్​లో బుధవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లు స్వయంగా ఓ వీడియో పోస్టు చేశారు. ఆ మరుసటి రోజు ఆమె దుకాణానికి రివ్యూలు ఘోరంగా పడిపోయాయి.

లూసియానాలోని ఓ సూపర్​ మార్కెట్​ మాజీ యజమాని బుధవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్నందున ఆ సూపర్​ మార్కెట్​ను బహిష్కరిస్తామని వినియోగదారులు చెప్పారు. ఇలా ట్రంప్​కు మద్దతు తెలిపేందుకు వెళ్లిన చాలా మంది తమకు తామే నష్టాలను కొని తెచ్చుకున్నారు.

ఇదీ చూడండి:ట్విట్టర్​కు దీటుగా ట్రంప్​ కొత్త యాప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.