Reverse house in Columbia: కొలంబియాలోని గ్వాటావిటా ప్రాంతంలో ఓ ఇల్లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ఆ ఇంటిని సందర్శించేందుకు ఇష్టపడుతున్నారు. అంతలా ఆకర్షించే ఆ ఇల్లు ప్రత్యేకత ఏంటీ అనుకుంటున్నారా? ఆ ఇంటిని పూర్తిగా తలకిందులుగా నిర్మించడమే.
ఫ్రిట్జ్ పాల్ అనే వ్యక్తి ఆ ఇంటిని డిజైన్ చేశారు. 2015లో ఫ్రిట్జ్ షాల్ తన మనవరాళ్లతో కలిసి ఆస్ట్రియాలోని స్వగ్రామానికి విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో తలకిందులుగా ఓ ఇల్లు చూశారు. దాని స్ఫూర్తితోనే అలాంటి ఇంటిని నిర్మించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంటి నిర్మాణం పూర్తైంది.
మూడు వారాల క్రితమే ఆ ఇంటిని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి చాలామంది తలకిందులుగా నిర్మించిన ఇంటిని చూడ్డానికి పెద్దఎత్తున వస్తున్నారు. ఆ ఇల్లు కొత్త అనుభూతిని ఇస్తున్నట్టు సందర్శకులు చెబుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 90ఏళ్ల వయసున్న ఈ చేప గురించి తెలుసా..?