అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో అగ్రరాజ్యానికి (US Travel Ban India) తరలివెళ్తున్నారు భారతీయులు. సోమవారం నుంచి అమెరికా-భారత్ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారిని అనుమతిస్తున్నట్లు అమెరికా ఇటీవల (US Travel Ban India) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆంక్షల కారణంగా భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులు తిరుగు ప్రయాణం చేపడుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం తమకు ఉపశమనం కలిగించిందని అంటున్నారు.
కరోనా కారణంగా గత ఏడాది మార్చి 23న (US Travel Ban India) అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ఇప్పుడు.. కొవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే సాధారణ ప్రయాణాలను పునరుద్ధరించడం లక్ష్యమని చెబుతోంది. భారత్ సహా చైనా, మెక్సికో, ఐరోపా, కెనడాకు చెందిన ప్రయాణికులపై కూడా అమెరికా ఆంక్షలను తొలగించింది.
- అమెరికా వెళ్లే విమానం ఎక్కేముందే విదేశీ పౌరులకు వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న కొవిడ్ పరీక్ష 'నెగెటివ్' రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. అయితే మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు లేదా జల మార్గం నుంచి వచ్చే ప్రయాణికులు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
- 18 ఏళ్ల లోపు వారు టీకాలు తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు. రెండేళ్లు, అంతకంటే చిన్న పిల్లలకు పరీక్ష అవసరం లేదు.
- విమానయాన సంస్థలే.. ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించాకే ప్రయాణాలకు అనుమతించాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు 35 వేల డాలర్ల వరకు జరిమానా విధించనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.
ఐరోపా నుంచే అత్యధికంగా ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది.
ఇదీ చూడండి : 'భారత్, తైవాన్‌పై చైనా గురి- ఏడాదిలో 250 క్షిపణి పరీక్షలు!'