ETV Bharat / international

ఇప్పటికైనా సిగరెట్ మానేస్తేనే కరోనా నుంచి రక్ష!

పొగతాగే అలవాటు ఉన్నవారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగ వల్ల ఏసీఈ-2 అనే ప్రొటీన్​ అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుందని.. దీని ద్వారా మానవ కణాల్లోకి వైరస్​ ప్రవేశిస్తుందని తెలిపారు.

VIRUS-CIGARETTE-INFECTION
కరోనా
author img

By

Published : May 19, 2020, 4:10 PM IST

సిగరెట్​ తాగే అలవాటు ఉన్నవారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. పొగతాగే వారి ఊపిరితిత్తులు వైరస్​పై ఉండే ప్రొటీన్ రిసెప్టార్​ (కొమ్ము వంటి నిర్మాణం)లను అధికంగా ఆకర్షించే అవకాశం ఉందని తేలింది. ఈ అలవాటును మానుకోవటం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్​ బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.

అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్​ హార్బర్​ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. పొగతాగేవారిలో కరోనా ప్రభావం అధికంగా ఉండటానికి గల కారణాలను 'డెవలప్​మెంటల్ సెల్​' జర్నల్​లో ప్రచురితమైన వ్యాసంలో వివరించారు.

"మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఏసీఈ-2 అనే ప్రొటీన్​ను కరోనా వైరస్ ఉపయోగించుకుంటుంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే పొగ తాడటం వల్ల ఏసీఈ-2 పెరుగుదల 30 నుంచి 55 శాతం అధికంగా ఉంటుందని మేం గుర్తించాం. అయితే ఈ పెరుగుదల తాత్కాలికమే. ధూమపానాన్ని వదిలేసిన వారిలో వీటి పెరుగుదల సాధారణంగానే ఉంది."

- జాసన్ షెల్జర్​, పరిశోధకుడు

శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే గోబ్​లెట్​ కణాలే వాయుమార్గంలో ఏసీఈ-2ను అభివృద్ధి చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. పొగతారే వారిలో ఈ కణాలు అధికంగా ఉన్నట్లు తెలిపారు.

"సిగరెట్​ పొగలో వందల రకాల రసాయనాలు ఉంటాయి. నికోటిన్​ వంటి పదార్థాలు పొగ కన్నా అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏసీఈ-2 ప్రొటీన్ పెరుగుదలతో కరోనా ఇన్ఫెక్షన్​ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. పొగతాడటం మానేస్తేనే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు."

- జాసన్ షెల్జర్, పరిశోధకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.