అమెరికాలోని అలస్కాలో శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. అంకరెజ్ పట్టణానికి నైరుతి దిక్కున 14.5 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. 42 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. 2018లో అంకరెజ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి: అమెరికాలో భూకంపం.. పలు ఇళ్లు ధ్వంసం