ETV Bharat / international

కర్కశ మాజీ పోలీసుపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు - Protests in minneapolis

అమెరికా మినియాపొలిస్‌లో ఓ నల్లజాతీయుడిపై కర్కశంగా వ్యవహరించిన మాజీ పోలీసు అధికారి పట్ల స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అతని ఇంటి పరిసరాలకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. భారీ సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

Protesters gather outside former US officer's home
కర్కశ మాజీ పోలీసుపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు
author img

By

Published : May 28, 2020, 1:04 PM IST

అమెరికాలో మినియాపొలిస్​తో పాటు ఆ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. ఓ ఆఫ్రికన్​ అమెరికన్​ పట్ల డెరెక్​ చావిన్​ అనే మాజీ పోలీసు అధికారి కర్కశంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. సదరు ఆఫ్రికన్​ వ్యక్తి కస్టడీలోనే చనిపోయిన నేపథ్యంలో.. డెరెక్​ ఇంటి పరిసరాలకు చేరుకున్న నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారీ సంఖ్యలో గుమిగూడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఇదే అదనుగా కొంత మంది చుట్టుపక్కల షాపులను ధ్వంసం చేస్తూ.. దొంగతనానికి పాల్పడుతున్నారు.

ఇదీ జరిగింది

ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్‌ ఫ్లాయిడ్‌ (46) అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ కనిపించాడు. కారు నుంచి వెలుపలికి రావాల్సిందిగా ఆదేశించారు. బయటకు రాగానే జార్జ్‌ను నేలపైకి పడగొట్టారు. సంకెళ్లు వేశారు. ఈ క్రమంలో జార్జ్‌ మెడపై పోలీసు అధికారి ఒకరు మోకాలు బలంగా ఆనించాడు.

కర్కశ మాజీ పోలీసుపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు

ప్రాణాలు పోతున్నా కనికరించలేదు..

"అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు" అని పక్కనే ఉన్న ఓ వ్యక్తి గట్టిగా అరిచినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు. ఆ తర్వాత జార్జ్‌లో క్రమక్రమంగా చలనం ఆగిపోయింది. అయినప్పటికీ పోలీసు అధికారిలో ఏమాత్రం కనికరం కనిపించలేదు. వైద్య సంరక్షణ సిబ్బంది స్ట్రెచర్‌ తెచ్చేవరకు మోకాలు తీయలేదు. ఈ ఘటనకు సంబంధించి డెరెక్‌ చావిన్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులను మంగళవారం విధుల నుంచి తొలగించారు.

ఇదీ చూడండి : ఆ కర్కశ పోలీస్‌పై తప్పుడు వార్తలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.