ETV Bharat / international

ట్రంప్​ మద్దతుదారులపై దేశద్రోహం కేసు!

అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద నిరసనలు చేపట్టిన అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులపై దేశ ద్రోహం కేసు నమోదు చేసేందుకు యోచిస్తున్నట్లు కొలంబియా ఫెడరల్​ ఉన్నతాధికారి తెలిపారు. అక్రమ చొరబాట్లు, ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

us attorney
క్యాపిటల్​ భవనంపై దాడి
author img

By

Published : Jan 8, 2021, 6:11 AM IST

అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద బుధవారం చెలరేగిన హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టారు ఫెడరల్​ అధికారులు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులపై దేశ ద్రోహం కేసుతో పాటు అన్ని రకాల అభియోగాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు కొలంబియా ఫెడరల్​ ఉన్నతాధికారి.

" అక్రమ చొరబాటు, ఆస్తుల ధ్వంసం, వంటి అభియోగాల కింది 15 కేసులు మోపాలని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని చర్యలు చేపట్టేందుకు కావాల్సిన సాక్ష్యాధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. నిరసనకారులపై తీసుకోవాల్సిన చర్యల అంశం పరిశీలనలో ఉంది. సాధ్యమైనంత మేరకు ఎక్కువ కేసులు పెట్టేందుకే చూస్తున్నాం. ఇప్పటి వరకు వాషింగ్టన్​లో 90 మందికిపైగా అరెస్ట్​ కాగా.. మరింత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. శాంతియుత అధికార బదిలీని అడ్డుకునే లక్ష్యంతో దాడికి పాల్పడింది ఎవరైనా చర్యలు తీసుకుంటామని దేశవ్యాప్తంగా ఉన్న అటార్నీలు చెబుతున్నారు. "

- మిచెల్​ షెర్విన్​, డీసీ అటార్నీ జనరల్​

పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు

అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద చెలరేగిన హింసకు బాధ్యులైన వారు వారి చర్యలకు పూర్తిస్థాయి పర్యవసనాలు ఎదుర్కుంటారని స్పష్టం చేశారు అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్​ జెఫెరి రోసన్​. 'మన ప్రభుత్వం, చట్టంపై జరిగిన దాడికి బాధ్యులైన వారు పూర్తిస్థాయిలో దాని పరిణామాలను ఎదుర్కొనేలా చూసేందుకు న్యాయ శాఖ కట్టుబడి ఉంది. నిన్నటి హింసలో పాల్గొన్న కొంతమందిపై ఈ రోజు అభియోగాలు మోపనున్నాం. సాక్ష్యాలు సేకరించటం, నిరసనకారులను గుర్తించటం కోసం న్యాయశాఖ క్రిమినల్​ విభాగం అధికారులు.. ప్రత్యేక ఏజెంట్లు, యూఎస్​ క్యాపిటల్​ పోలీసులు, ఎఫ్​బీఐ, ఏటీఎఫ్​తో కలిసి పనిచేస్తున్నారు' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'క్యాపిటల్‌'కు నిలువెల్లా గాయాలే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.