అమెరికా పర్యటనలో భాగంగా(Modi US visit 2021) ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో(Joe Biden news) శుక్రవారం భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news). సుమారు గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా.. భారత్‌తో రక్షణ సంబంధాల బలోపేతానికి, సత్సంబంధాలకు(Modi US visit highlights) కట్టుబడి ఉన్నామని జో బైడెన్(Joe Biden news) హామీ ఇచ్చినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. రక్షణ రంగంలో అధునాతన పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంచడాన్ని నాయకులు స్వాగతించారని తెలిపారు.
మరోవైపు.. రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యంపై వాస్తవ నివేదికను విడుదల చేసింది శ్వేతసౌధం. '2016 నుంచి ఇరు దేశాల మద్య నాలుగు కీలక రక్షణ ఒప్పందాలు జరిగాయి. సమాచార మార్పిడి, ద్వైపాక్షిక, బహుల పాక్షిక ప్రదర్శనలు, సముద్రాల భద్రత, రవాణా సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.' అని తెలిపింది.
వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై దృష్టి..
జో బైడెన్‌తో సమావేశంలో(Modi US visit 2021) అమెరికాతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై ప్రధాని మోదీ ప్రధానంగా చర్చించారని తెలిపారు ష్రింగ్లా. అలాగే.. ట్రిప్స్(టీఆర్ఐపీఎస్) పేపర్‌పైనా నేతలు మాట్లాడినట్లు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఐపీఆర్‌ను రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా సూచనకు అమెరికా మద్దతు పలకటంపై ఆ దేశానికి భారత్ కృతజ్ఞతలు తెలిపిందన్నారు ష్రింగ్లా. ఐపీఆర్ రద్దు చేయటం ద్వారా కొవిడ్ వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుతాయన్నారు. వాణిజ్యం సమస్యల పరిష్కారం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచటంపై భారత్‌తో కలిసి పని చేయనున్నట్లు శ్వేతసౌధం విడుదల చేసిన వాస్తవ నివేదిక తెలిపింది.
హెచ్1బీ వీసాలపై ప్రస్తావన..
జోబైడెన్‌తో తొలిసారి ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ.. హెచ్1బీ సహా అమెరికాలోని భారతీయులకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు ష్రింగ్లా ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌కు చెందిన వృత్తి నిపుణుల ప్రవేశాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల్లో భాగంగా వీసాల గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఓ వాస్తవ నివేదిక విడుదల చేసిన శ్వేతసౌధం 2021లో ఇప్పటివరకు 62 వేల విద్యార్థి వీసాలు భారతీయ విద్యార్థులకు జారీ చేసినట్లు తెలిపింది. దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు.. ప్రతి ఏడాది అమెరికా ఆర్థికవ్యవస్థకు 7.7 బిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: 'భారత్‌లో బంధువులు'- మోదీతో భేటీలో బైడెన్ హాస్యం