గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కొవిడ్-19 టీకా వల్ల.. సాధారణ మహిళల కన్నా ఎక్కువగా దుష్ప్రభావాలు తలెత్తబోవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 17,525 మంది మహిళలపై అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు.
"వ్యాక్సిన్ వల్ల సాధారణంగా తలెత్తే దుష్ప్రభావాలకు మించి గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో అదనపు సమస్యలేమీ ఉత్పన్నం కాలేదు" అని పరిశోధనకు నాయకత్వం వహించిన లిండా ఎకెర్ట్ చెప్పారు.
పరీక్షార్థుల్లో ఎక్కువ మంది (62 శాతం) ఫైజర్ టీకాను పొందినట్లు తెలిపారు. వీరిలో 91 శాతం మందికి ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి కలిగింది. 31 మందికి అలసట, స్వల్ప జ్వరం తలెత్తింది. 5-7 మందిలో టీకా పొందాక స్తన్యం ఉత్పత్తి తగ్గింది. దీన్ని బట్టి మహిళలు టీకాలను బాగానే తట్టుకోగలరని, భవిష్యత్‌లో ఇతర వ్యాక్సిన్ల అభివృద్ధి సమయంలో వీరినీ క్లినికల్ ప్రయోగాల్లో చేర్చాలని పరిశోధకులు సూచించారు.
అధ్యయన ఫలితాలు గర్భిణుల్లో భరోసా నింపేలా ఉన్నాయని లిండా చెప్పారు. అందువల్ల వారు తప్పనిసరిగా కొవిడ్ టీకా పొందాలన్నారు.
ఇదీ చదవండి: కరోనా టీకా రెండో డోసు ఎగ్గొట్టిన వారు 3.86 కోట్లు!