వెనిజువెలాలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైంది. ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ జరగక రెండు రోజుల వ్యవధిలోనే15 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగారు. రాజధాని కరాకస్ సహా పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. ఇప్పటికే రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజువెలాను విద్యుత్ కష్టాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.
దేశవ్యాప్తంగా మరో 10 వేల 200 మంది రోగులు డయాలసిస్‌పై ఆధారపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది ప్రభుత్వం.
అమెరికా చర్యల కారణంగానే విద్యుత్ సమస్య అనిదేశాధ్యక్షుడు నికోలస్ మధురో ఆరోపించారు. వేగంగా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ, సైబర్ దాడుల కారణంగా ఈ చర్యలు ఫలించట్లేదని తెలిపారు. ప్రతిపక్ష నేత గ్వైడోదేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.