ప్రజలంతా రోడ్లపైనే ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ర్యాలీలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
వైద్యం అందక 15 మంది రోగులు మృతి
విద్యుత్ సంక్షోభం 15 మంది రోగుల మరణానికి కారణమైంది. ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా లేక డయాలసిస్ రోగులకు చికిత్స అందించలేకపోయారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే మరింత ప్రాణ నష్టం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
విద్యుత్ సంక్షోభంతో వ్యాపారాలూ దెబ్బతిన్నాయి. కొందరు అందుబాటులో ఉన్న వనరులతో కష్టాలు అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరాకస్‌లోని ఓ బేకరి యజమాని.... కారు బ్యాటరీని రిఫ్రిజిరేటర్, క్యాష్ రిజిస్టర్ అనుసంధానం చేశాడు. అన్ని దుకాణాలు మూసివేసి ఉన్నా... ఈ ఒక్క బేకరీ మాత్రం రద్దీగా ఉంది.
"తక్కువ రోజులు నిలవ ఉండే ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలనే కారు బ్యాటరీ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నా."
-గోన్కాల్వస్, బేకరీ యజమాని
'చీకటి'పై రాజకీయం
విద్యుత్ సంక్షోభానికి ప్రత్యర్థులే కారణమని ఆరోపించారు అధ్యక్షుడు నికోలస్ మదురో.
"విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేక శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎలక్ట్రోమాగ్నటిక్ దాడులకు పాల్పడుతున్నారు. వీరిలో విద్యుత్ కేంద్ర సిబ్బంది కూడా ఉన్నట్లు గుర్తించాం. వారికి కఠిన శిక్ష పడేలా చేస్తాం."
-నికోలస్ మదురో, వెనిజువెలా అధ్యక్షుడు
వెనిజువెలా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా ర్యాలీకి పిలుపునిచ్చారు ప్రతిపక్ష నేత జువాన్ గయిడో.