ETV Bharat / international

జనాభా వృద్ధిలో క్షీణత- ఆ దేశాలకు ఇక కష్టాలేనా? - జపాన్ జనాబా

చైనా, అమెరికాలో జనాభా వృద్ధి నెమ్మదించింది. జపాన్​లో పిల్లల జనాభా 40ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇటలీలో జనాభా వృద్ధిలో తగ్గుదలపై పోప్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో జనాభా తగ్గడానికి కారణాలేంటి? ప్రజల జీవనశైలిలో మార్పుల వల్లేనా? వారి ఆలోచనా ధోరణి మారిందా? ఇలానే కొనసాగితే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది?

population crisis in top countries is concerning
జనాభా వృద్ధిలో క్షీణత
author img

By

Published : May 16, 2021, 6:42 PM IST

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశాల్లో జనాభా వృద్ధి రికార్డు స్థాయిలో పతనమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గే ముప్పుంది. ఫలితంగా శ్రామిక శక్తి లేక ఆయా దేశాల వృద్ధికి విఘాతం ఏర్పడే ప్రమాదముంది.

అసలు జనాభా తగ్గుదలకు కారణాలేంటి? ప్రజలు పిల్లల్ని కనడానికి సుముఖంగా లేరా? ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించినా ఆసక్తి చూపడం లేదా? నిపుణులు ఏం చెబుతున్నారు?

అగ్రరాజ్యంలో

అమెరికా జనాభా వృద్ధి నెమ్మదించినట్లు సెన్సస్​ బ్యూరో ఇటీవల ప్రకటించింది. గత పదేళ్లలో అమెరికా జనాభా 7.4 శాతం మాత్రమే పెరిగినట్లు తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నాటికి ఆ దేశ జనాభా 33.1 కోట్లుగా ఉందని వెల్లడించింది. 1930 తర్వాత అతి తక్కువ జనాభా వృద్ధి రేటు ఇదే కాగా.. అమెరికా చరిత్రలో రెండో అత్యల్ప వృద్ధి.

కారణాలు

  • అమెరికా జనాభా వృద్ధి మందగించడానికి ఆ దేశంలో వరుసగా ఆరు సంవత్సరాల పాటు జననాల రేటు తగ్గడమూ ఓ కారణం.
  • 2020లో ప్రతి 1000 మంది మహిళల్లో ఫెర్టిలిటీ రేటు 64.1 నుంచి 55.8 శాతానికి పడిపోయింది.
  • యుక్తవయసు మహిళల గర్భధారణ శాతమూ గణనీయంగా తగ్గింది.
  • కరోనా వల్ల సంభవించిన మరణాలు కూడా జనాభా వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఏమవుతుంది?

  • జనాభా వృద్ధి రేటు ఇలాగే క్షీణిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాంస్కృతిక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • తక్కువ జననాల వల్ల యువ శ్రామిక శక్తిపై ప్రభావం పడుతుంది. ఉత్పాదకత తగ్గుతుంది. రిటైర్ అయ్యే వాళ్ల సంఖ్య పెరిగి సమతుల్యం దెబ్బతింటుంది.
  • వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గడం వల్ల కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు క్షీణిస్తాయి. ఫలితంగా దేశాభివృద్ధి మందగిస్తుంది.

సానుకూలాంశాలు..

  • అయితే జనాభా వృద్ధికి అమెరికాకు ఉన్న అవకాశాలు మరే ఇతర దేశానికీ లేవు. అగ్రరాజ్యానికి వలస వెళ్లే వారి సంఖ్య ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ. వలసదారులను పరిణగణనలోకి తీసుకోకపోతే అమెరికా జనాభా నాలుగు కోట్లు తగ్గుతుంది.
  • అవకాశం వస్తే అమెరికా వెళ్లి స్థిరపడాలనుకునేవారి సంఖ్య లాటిన్​ అమెరికా, కరీబియన్​ దేశాల్లోనే 4.2కోట్లుగా ఉంది.
  • అమెరికన్ల సగటు వయస్సుతో పోల్చితే వలసదారుల సగటు వయస్సు ఏడేళ్లు తక్కువ. దీని వల్ల యువ శ్రామిక శక్తిని కొన్ని దశాబ్దాల పాటు అమెరికా వినియోగించుకోవచ్చు.
  • అయితే 2016 వరకు ఏటా 10 లక్షలుగా ఉన్న వలసదారుల సంఖ్య 2019లో 5.6 లక్షలకు పడిపోయింది. జనాభా వృద్ధి తగ్గుదల ప్రభావం లేకుండా ఉండాలంటే ఇమ్మిగ్రేషన్​ను​ 37శాతం పెంచాలని అమెరికా భావిస్తోంది.

చైనాలో పరిస్థితి..

ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనాలో.. జనాభా వృద్ధి క్రమక్రమంగా సున్నాకు సమానంగా చేరుకుంటోంది. అతి తక్కువ మందికి పిల్లలు ఉండటం వల్ల ఈ దశాబ్దంలో వృద్ధి రేటు సున్నాకు దగ్గరైందని ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన పదేళ్ల కాలంలో 7 కోట్ల 20 లక్షల మంది పుట్టగా.. మొత్తం జనాభా 141 కోట్ల 10 లక్షలకు చేరిందని తెలిపింది. అయితే వార్షిక వృద్ధిరేటు 0.53 శాతానికే పరిమితమైనట్లు పేర్కొంది.

పెరిగిపోతున్న జనాభా కట్టడికి చైనా నాయకులు 1980 నుంచి సంతానంపై పరిమితులు, ఆంక్షలు విధిస్తూ రావడం ఆ దేశానికి ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల సంపన్న ఆర్థిక వ్యవస్థను సృష్టించే ప్రయత్నాలకు సరిపడా శ్రామిక శక్తి లేకపోడం నాయకులకు ఆందోళన కలిగిస్తోంది.

కారణాలు

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా ఆంక్షలను చైనా ప్రభుత్వం సడలించినప్పటికీ.. పెరిగిన ఖర్చులు, ఇరుకు గదులు, నిరుద్యోగ సమస్య వంటి వాటితో ఎన్నో జంటలు స్వచ్ఛందంగా పిల్లలను కనడానికి మొగ్గుచూపడం లేదని నిపుణులు అంటున్నారు.

  • చైనాలో జననాల సంఖ్య 2019లో 14.65 మిలియన్లుగా ఉండగా.. 2020లో 12 మిలియన్లకు పడిపోయింది.
  • మహిళల్లో ఫెర్టిలిటీ రేటు 1.3శాతంగానే ఉంది. 2016లో చైనా ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రకటించకపోతే ఇది 1.1శాతానికే పరిమితమయ్యేది.
  • ప్రజలు సంతానంపై ఆసక్తి చూపకపోవడానికి కరోనా ప్రభావమూ ఓ కారణం.

ఏం చేయాలి?

  • చైనా జనాభా వృద్ధి పెరగాలంటే ప్రోత్సాహకాలు ప్రకటించాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
  • ఓక్కో సంతానానికి ఒక మిలియన్​ యువాన్లు కానుకగా ఇవ్వాలి.
  • కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేయాలి.
  • ఎంత మంది పిల్లల్ని కనాలనే విషయాన్ని ప్రజలకే వదిలేయాలి.
  • జనాభా పెరుగుదల ప్రోత్సాహకాల కోసం చైనా జీడీపీలో 2-10 శాతం కేటాయించాలి

వచ్చే పదేళ్లలో చైనాలో 22-35 ఏళ్ల మహిళల సంఖ్య 30 శాతం పడిపోతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నూతన జననాల సంఖ్య ఏటా 10లక్షల లోపే నమోదయ్యే అవకాశముంది. ఇది ప్రపంచంలోనే అత్యల్పం కానుంది. అందుకే పైనా పేర్కొన్న సూచనలను అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఇటలీలో ఆందోళన..

ఐరోపా దేశం ఇటలీలో జననాల రేటు గణనీయంగా తగ్గడంపై పోప్ ఫ్రాన్సిస్​ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా వృద్ధి క్షీణతపై ప్రజల్ని హెచ్చరించిన ప్రధాని మారియో ద్రాఘితో ఆయన గొంతు కలిపారు. యువత దేశాన్ని వీడకుండా ఉండేలా ప్రభుత్వం ఆర్థికంగా స్థిరమైన విధానాలు రూపొందించాలని సూచించారు.

ఇటలీలో గత మూడేళ్లుగా జనాభా వృద్ధిలో క్షీణత నమోదైంది. గతేడాది జననాల సంఖ్య 404,000కే పరిమితమైంది. 1861 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో జననాలు ఉండటం ఇదే తొలిసారి. మహిళల ఫెర్టిలిటీ రేటు విషయంలో ఐరోపా దేశాల్లోనే ఇటలీ అట్టడుగున ఉంది. కరోనా కారణంగా 2020లో సంభవించిన మరణాల వల్ల జననాలు, మరణాల మధ్య వ్యత్యాసం 3,42,000గా ఉంది. 1918 స్పానిష్ ఫ్లూ తర్వాత ఇంత వ్యత్యాసం ఉండటం ఇదే ప్రథమం. పిల్లలు లేని ఇటలీకి భవిష్యత్తులో ఊహించుకోలేమని ప్రధాని ద్రాఘి వ్యాఖ్యానించారు.

బోనస్​లు..

మొదటి సంతానం తర్వత పుట్టే ప్రతి బిడ్డకు బోనస్​ ఇస్తామని ఇటలీ ప్రభుత్వం ప్రకటించడాన్ని పోప్ స్వాగతించారు. పిల్లల్ని కనాలనుకునేవారికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా కల్పించేలా సుదీర్ఘ కుటుంబ కేంద్రీకృత విధానాలను రూపొందించాలని సూచించారు. యువత దేశం వీడకుండా స్థిరమైన ఉద్యోగాలు, సొంతిళ్లు, భద్రత కల్పించాలన్నారు. ఇది అత్యావశ్యకమని స్పష్టం చేశారు.

2019 జనాభా లెక్కల ప్రకారం ఇటలీ జనాభా 6.04 కోట్లు.

జపాన్​లో భారీగా తగ్గిన పిల్లలు..

జపాన్​లో గత 40 ఏళ్లుగా తగ్గుతూ వస్తోన్న పిల్లల జనాభా ఈసారి రికార్డు స్థాయిలో పతనమవ్వడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

  • ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జపాన్​లో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న పిల్లల జనాభా 14.93 మిలియన్లు. గతేడాదితో పోల్చుకుంటే ఇది 1,90,000 తక్కువ. 1950 తర్వాత ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి.
  • జపాన్ మొత్తం జనాభాలో పిల్లలు 11.9 శాతం. 47 ఏళ్లలో ఇదే కనిష్ఠం.
  • 4 కోట్లకుపైగా ఎక్కువ జనాభా ఉన్న 33 దేశాల్లో పిల్లల నిష్పత్తి అత్యంత తక్కువగా ఉంది జపాన్​లోనే కావడం గమనార్హం. ఇది దక్షిణ కొరియాలో 12.2శాతం, ఇటలీలో 13.3శాతంగా ఉంది.
  • 1954లో జపాన్​లో పిల్లల జనాభా 29.89 మిలియన్లుగా ఉండేది. 1970 వరకు పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 1982నుంచి ఏటా క్షీణించింది.

2019 జనాభా లెక్కల ప్రకారం జపాన్​ జనాభా 12.63 కోట్లు.

ఇదీ చూడండి: భారత్​కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.