ETV Bharat / international

'చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఒక 'ధూర్త శక్తి'' - POMPEO

భారత్​తో సరిహద్దు వివాదాన్ని చైనా సైన్యం తీవ్రతరం చేస్తోందని విమర్శించింది అమెరికా. చైనా కమ్యూనిస్ట్​ పార్టీ (సీసీపీ) ఒక 'ధూర్త శక్తి'గా అభివర్ణించింది. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ దుస్సాహసాలకు పాల్పడుతోందని ఆరోపించింది.

POMPEO
చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఒక 'ధూర్త శక్తి' : అమెరికా
author img

By

Published : Jun 20, 2020, 5:30 AM IST

భారత్​పై చైనా చేస్తున్న కుయుక్తులను అగ్రరాజ్యం అమెరికా ఎండగట్టింది. సరిహద్దు వివాదాన్ని తీవ్రతరం చేస్తోన్న చైనా ఆర్మీపై విమర్శలు గుప్పించింది. చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఒక 'ధూర్త శక్తి'గా అభివర్ణించింది. ఇటీవల చైనా అవలంభిస్తున్న తీరును తప్పుపట్టారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్​ పాంపియో. నాటో వంటి సంస్థల ద్వారా సాధించిన పురోగతిని కాలరాసి, బీజింగ్​కు అనుగుణంగా ఉండే కొత్త నియమ నిబంధనలను అనుసరించాలని చైనా కమ్యూనిస్ట్​ పార్టీ కోరుకుంటోందని పేర్కొన్నారు.

శుక్రవారం జరిగిన కోపన్​హాగెన్​ ప్రజాస్వామ్య సదస్సును ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

" భారత్​తో సరిహద్దు వివాదాన్ని పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ పెంచుతోంది. దక్షిణ చైనా సముద్రంలో బలగాలను మోహరించి అక్రమంగా ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించింది. కీలకమైన సముద్ర మార్గాలను తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి ఒప్పందాలను కాలరాస్తూ హాంకాంగ్​ ప్రజల స్వేచ్ఛను హరిస్తోంది. చైనా కమ్యూనిస్ట్​ పార్టీ(సీసీపీ) అనేక అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. చైనా ముస్లింలపై అణచివేతకు పాల్పడుతోంది. అది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడనటువంటి మానవహక్కుల ఉల్లంఘన. తన సొంత పరిసరాల్లో సీసీపీ ధూర్త శక్తి మాత్రమే కాదు.. కరోనా వైరస్​పై అబద్ధాలు చెప్పింది. దాంతో వైరస్​ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. డబ్ల్యూహెచ్​ఓపై ఒత్తిడి చేసి.. తమ తప్పును కప్పిపుచ్చుకనే ప్రయత్నం చేసింది చైనా. అది లక్షల మంది ప్రాణాలు పోయేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేందుకు కారణమైంది."

- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో చైనా సైనికులతో ఘర్షణ తలెత్తి ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత జవాన్లుకు సంతాపం ప్రకటించారు మైక్​ పాంపియో. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: 'అందుకే భారత్​తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.