చిలీలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. లక్షలమంది ప్రజలు రహదారులపైకి చేరి శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు ఆందోళనకారులు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనలకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బులెట్లు ప్రయోగించారు.
దేశ ఆర్థిక స్థితి, అసమానత, మెట్రో టికెట్ల ధరల పెంపు నేపథ్యంలో వారం రోజులుగా చిలీలో అల్లర్లు చెలరేగుతున్నాయి.
ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం