అమెరికాలో కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. నెబ్రస్కా రాష్ట్రంలోని షాపింగ్‌మాల్ కాల్పుల ఘటన మరవకముందే విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషా నగరంలో తుపాకీ పేలింది. సోమెర్స్ గ్రామంలోని పబ్ (టవెర్న్)లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్లు కెనోషా రాష్ట్ర గవర్నర్ డావిడ్ రైట్ తెలిపారు. కొంత మందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని, సాధారణ ప్రజలకు ఎలాంటి హాని లేదని చెప్పారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పబ్‌కు వెళ్లే దారులను మూసివేశారు.
ఇదీ చూడండి: షాపింగ్ మాల్లో కాల్పులు- ఒకరు మృతి