ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం.. పోలీస్​ సహా దుండగుడు మృతి

Shooting in America: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సోరీ రాష్ట్రంలోని జోప్లిన్​ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో ఇద్దరు అధికారులకు తూటాలు తగిలాయి.

shooting
అమెరికాలో కాల్పుల కలకలం
author img

By

Published : Mar 9, 2022, 11:05 AM IST

Shooting in America: అమెరికా, మిస్సోరీ రాష్ట్రంలోని నైరుతి నగరం జోప్లిన్​లో మంగళవారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అనుమానితుడు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అసిస్టెంట్​ పోలీస్​ చీఫ్​ బ్రియాన్​ లేవిస్​ తెలిపారు.

నార్త్​పార్క్​ క్రాసింగ్​ షాపింగ్​ కేంద్రంలోని ఓ స్టోర్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇద్దరు పోలీసు అధికారులకు తూటాలు తగిలాయి. దుండగుడు పోలీసు కారును దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక కారును వదిలేసి పరుగు అందుకున్నాడు. అతన్ని వెంబడించిన పోలీసులు.. సెంట్రల్​ జోప్లిన్​ ప్రాంతంలోకి చేరుకోగా ఓ అధికారి, దుండగుడిపై కాల్పులు జరిపారు.

ఇదీ చూడండి: ఆ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.