హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనలోని సహానుభూతి కోణాన్ని చాటుకున్నారు. సమావేశానికి హాజరైన అమెరికా సెనేటర్ జాన్ కర్నిన్ భార్యకు క్షమాపణలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఆదివారం కర్నిన్ జీవిత భాగస్వామి సాండి (60) జన్మదినం. అయినప్పటికీ ఆయన సతీసమేతంగా హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రసంగం తర్వాత కర్నిన్-సాండిని కలిశారు ప్రధాని. సెనేటర్ భార్యను క్షమాపణలు కోరారు.
-
Here is what happened when PM @narendramodi met Senator @JohnCornyn. pic.twitter.com/O9S1j0l7f1
— PMO India (@PMOIndia) September 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here is what happened when PM @narendramodi met Senator @JohnCornyn. pic.twitter.com/O9S1j0l7f1
— PMO India (@PMOIndia) September 23, 2019Here is what happened when PM @narendramodi met Senator @JohnCornyn. pic.twitter.com/O9S1j0l7f1
— PMO India (@PMOIndia) September 23, 2019
సాండికి ప్రధాని సారీ చెబుతుంటే.. జాన్ కర్నిన్ ఆయన వెనకాల నిలబడి ముసిముసి నవ్వులతో మురిసిపోయారు.
"ఈ రోజు మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మీ పుట్టినరోజు అయినా... మీ గొప్ప జీవిత భాగస్వామి నాతో ఉన్నారు. కాబట్టి సహజంగా మీరు ఈరోజు అసూయపడాలి. మీ భవిష్యత్తు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా."
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమమంత్రి.
మోదీ క్షమాపణలు చెబుతున్న వీడియోను ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇదీ చూడండి: 'ఏటా 5 విదేశీ కుటుంబాలను భారత్కు పంపండి'