ETV Bharat / international

క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!

ప్రయోగాల్లో తమ టీకా సామర్థ్యం 95 శాతం ఉన్నట్లు వెల్లడించిన ఫైజర్​-బయెఎన్​టెక్​ సంస్థలు.. అంతా సానుకూలంగా జరిగితే ఈ క్రిస్మస్​కు ముందే టీకా పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఏడాది చివరి నాటికి 5 కోట్ల డోసులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఎఫ్​డీఏ, ఈయూకి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించాయి.

Pfizer-vaccine
క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!
author img

By

Published : Nov 19, 2020, 1:24 PM IST

కరోనా నివారణ కోసం ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతా సానుకూలంగా జరిగితే క్రిస్మస్‌ కంటే ముందే టీకా పంపిణీ ప్రారంభిస్తామని బయోఎన్‌టెక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉగర్‌ సహిన్ వెల్లడించినట్లు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది.

టీకా ప్రయోగాలు పూర్తయినట్లు ఫైజర్‌, బయో ఎన్‌టెక్ బుధవారం ప్రకటించింది. ప్రయోగాల్లో దీని సామర్థ్యం 95 శాతం వరకు ఉందని తేలినట్లు సంస్థలు వెల్లడించాయి. అత్యవసర అనుమతుల కోసం అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ), యూరోపియన్‌ యూనియన్‌కు దరఖాస్తు చేసినట్లు ఉగర్‌ సహిన్‌ తెలిపారు.

"అంతా బాగా జరిగితే డిసెంబరు రెండో అర్ధభాగంలో అనుమతులు రావొచ్చని భావిస్తున్నాం. క్రిస్మస్‌కు ముందే టీకా పంపిణీ మొదలుపెడతాం. అయితే అంతా సానుకూలంగా జరిగితేనే"

- ఉగర్​ సహిన్, బయోఎన్​టెక్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​

ఏడాది చివరి నాటికి 5 కోట్ల డోసులు

ఈ ఏడాది చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేస్తామని ఫైజర్‌ వెల్లడించింది. వీటి వల్ల 2.5 కోట్ల మందిని కరోనా నుంచి రక్షించొచ్చని పేర్కొంది. అలాగే 2021 నాటికి 13 కోట్ల డోసులు తయారుచేస్తామని సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది టీకా పంపిణీ కోసం ఇప్పటికే బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌, యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాలు చేసుకున్నట్లు ఫైజర్‌ తెలిపింది.

ఫైజర్‌ టీకాను మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చాల్సిన అవసరం ఉండటంతో టీకా రవాణా కాస్త సంక్లిష్టంగా మారింది. అయితే దీన్ని సాధారణ రిఫ్రిజిరేషన్‌లో ఐదు రోజుల వరకు, థర్మల్‌ షిప్పింగ్‌ బాక్సుల్లో 15 రోజుల వరకు ఉంచొచ్చని కంపెనీ చెబుతోంది. రవాణా సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంచేందుకు డ్రై ఐఎస్‌ను ఉపయోగిస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: గుడ్​న్యూస్​: ఫైజర్​ టీకా 95 శాతానికిపైగా ప్రభావవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.