ETV Bharat / international

అమెరికాకు మరో 10 కోట్ల డోసుల ఫైజర్​ టీకా - National Institutes of Health.

అమెరికాకు ఫైజర్​, బయోఎన్​టెక్​ కలిసి మరో 10 కోట్ల డోసుల కొవిడ్​ టీకాను సరఫరా చేయనున్నాయి. ఈ మేరకు కొత్త ఒప్పందం కుదిరింది. జులై 31లోపు టీకా పంపిణీ చేయనున్నట్లు ఫైజర్​ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Pfizer to supply US with additional 100M doses of vaccine
అమెరికాకు మరో 10 కోట్ల డోసుల ఫైజర్​ టీకా
author img

By

Published : Dec 24, 2020, 6:01 AM IST

ఫార్మా దిగ్గజం ఫైజర్‌, బయోఎన్‌టెక్‌లు అమెరికాకు మరో పది కోట్ల డోసుల కరోనా టీకాను సరఫరా చేయనున్నాయి. ఈ మేరకు కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. జులై 31వ తేదీ వరకూ అన్ని డోసులను సరఫరా చేయనున్నట్లు ఫైజర్‌ ప్రతినిధులు తెలిపారు.

ఇంతకుముందు పది కోట్ల డోసుల కరోనా టీకా సరఫరా చేసేందుకు ఫైజర్‌ ఒప్పందం చేసుకుంది. తాజా ఒప్పందంతో కలిసి మొత్తం 20 కోట్ల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా మొట్టమొదటగా ఫైజర్‌ టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్​డీఏ నుంచి అనుమతి లభించింది. ఆ తర్వాత మోడెర్నా టీకా అనుమతి పొందింది.

ఇదీ చూడండి: ఫైజర్​ టీకా.. ఒక్కో దేశంలో ఒక్కో ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.