కొవిడ్‌పై తమ ప్రయోగాత్మక యాంటీవైరల్ పిల్(pfizer pill latest news) సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించింది. ఈ మాత్ర వేసుకుంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరంతో పాటు కొవిడ్ మరణాల రేటు దాదాపు 90శాతం మేర తగ్గిందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలినట్టు వెల్లడించింది(covid pill treatment).
మొత్తం 775మంది వయోజనులపై ఈ పరిశోధన జరిగింది(pfizer pill covid). ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని ఈ పరిశోధనలో భాగస్వామ్యం చేసినట్లు పేర్కొంది. వైరస్ లక్షణాలు కనిపించాక 3 నుంచి 5 రోజుల పాటు మాత్రలు తీసుకున్నారని ఫైజర్ సంస్థ వెల్లడించింది. మాత్రలు తీసుకున్న నెలరోజుల తరువాత వీరిలో.. ఒక శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారని, ఎటువంటి మరణాలు సంభవించలేదని సంస్థ తెలిపింది. మొత్తం మీద మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 89శాతం తగ్గిందని స్పష్టం చేసింది.
తాము రూపొందించిన పిల్ వినియోగానికి అనుమతుల కోసం ఫైజర్.. త్వరలోనే ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోనుంది. రానున్న నెలల్లో దీనిపై ఎఫ్‌డీఏ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
యూకేలో మెర్క్..
కొవిడ్ చికిత్సలో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఇంజెక్షన్లే వినియోగిస్తున్నారు. అయితే మోల్నుపిరవిర్ పేరుతో మెర్క్(merck pill covid) ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన పిల్‌కు గురువారమే యూకే ఆమోదం తెలిపింది. కొవిడ్ బారిన పడ్డ వయోజనుల కోసం ఈ పిల్స్ వినియోగించవచ్చు. అయితే కరోనా రిస్క్ ఫ్యాక్టర్లలో ఏదో ఒకటి బాధితులకు ఉంటేనే వీటిని తీసుకోవాలని యూకే నియంత్రణ సంస్థ పేర్కొంది. ఐదు రోజుల పాటు రోజుకు రెండు సార్లు ఈ మాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. మోల్నుపిరవిర్ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా సాధారణంగా ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. కొవిడ్ చికిత్సలో వినియోగిస్తున్న ఇంజెక్షన్ రూపంలో ఉన్న మందుల కంటే మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
అమెరికా ఎఫ్‌డీఏ వద్ద మోల్నుపిరవిర్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. దీనికి అనుమతులు లభించకముందే చాలా వరకు దేశాలు మాత్రల కోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చేశాయి.
మెర్క్‌కు పోటీగా, కొవిడ్ చికిత్సకు అమెరికాలో తొలి పిల్‌ను తీసుకొచ్చేందుకు ఫైజర్ శ్రమిస్తోంది.
ఇదీ చూడండి:- చిన్నారులకు ఫైజర్ టీకా పంపిణీకి ఆమోదం