ETV Bharat / international

ఐదేళ్ల లోపు చిన్నారులకు త్వరలోనే కొవిడ్​ టీకా! - pfizer for kids under 5

Pfizer for under 5 years kids: ఐదేళ్లలోపు చిన్నారులకు కొవిడ్​ టీకా ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కోరుతూ ఎఫ్​డీఏకు దరఖాస్తు చేస్తుంది ఫైజర్. ఈ టీకా అందుబాటులోకి వస్తే ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారుల వరకు వ్యాక్సిన్​ ఇవ్వవచ్చని ఫైజర్ తెలిపింది.

Pfizer
ఫైజర్​
author img

By

Published : Feb 2, 2022, 12:12 PM IST

Pfizer for under 5 years kids: చిన్న పిల్లలకు కొవిడ్​ టీకా అంశంలో కీలక ముందడుగు పడింది. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారులకు కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్​డీఏకు దరఖాస్తు చేసుకుంది ఫైజర్‌.

తమ కొవిడ్‌ టీకాకు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని సవరించి 6నెలల పసికందు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులను కూడా చేర్చాలని ఎఫ్​డీఏను కోరినట్లు ఫైజర్‌ తెలిపింది. ఎఫ్​డీఏ అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలిటీకాగా ఫైజర్‌ నిలవనుంది. కరోనా కారణంగా అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్‌ తెలిపింది. భవిష్యత్‌ వేరియంట్లను ఎదుర్కొనటంతో పాటు వైరస్‌ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్​డీఏతో కలిసి పని చేస్తున్నట్లు ఫైజర్‌ పేర్కొంది.

ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే టీకా.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఫైజర్​ తెలిపింది. ఇది దేశంలో పాఠశాలలకు వెళ్లని సుమారు కోటి 90 లక్షల చిన్నారుల కోసం రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా అక్కడ ఐసోలేషన్‌ అక్కర్లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.