నిత్యావసర వస్తువులు కోసం ప్రజలు తమ కార్లలో కిలోమీటర్ల దూరం వరకు బారులు తీరిన దృశ్యం యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లో ఆవిష్కృతమైంది.
కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ... అధికారులు ఇంగిల్‌వుడ్‌లో ఫుడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. సుమారు 5,000 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడానికి ఏర్పాట్లు చేశారు.
ప్రజలు కిరాణా సామగ్రి కోసం తమ కార్లలోనే కిలోమీటర్ల దూరం వరకు బారులు తీరారు. అయితే వారు బయటకు రావాల్సిన అవసరం లేకుండానే వలంటీర్లే స్వయంగా కిరాణా సామగ్రిని కార్లలో పెట్టారు.
నిత్యావసరాలకు డిమాండ్
కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఆలస్యంగా మేల్కొన్న అగ్రరాజ్యం అంటువ్యాధి నివారణ కోసం పలు ఆంక్షలు అమలుచేస్తోంది. ఫలితంగా నిత్యావసర సరకులకు డిమాండ్ పెరిగింది.
ఇదీ చూడండి: కరోనా సాకుతో ఉద్యోగుల్ని తీసేయొచ్చా? చట్టంలో ఏముంది?