అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో గత నెల 29న జరిపిన డ్రోన్ దాడికి (kabul strike) సంబంధించి అమెరికా ఎట్టకేలకు తప్పు అంగీకరించింది. నాటి దాడిలో కేవలం సాధారణ ప్రజలే చనిపోయినట్లు తమ అంతర్గత సమీక్షలో తేలిందని శుక్రవారం తెలిపింది.
కాబుల్ విమానాశ్రయం వైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై తాము డ్రోన్ దాడి చేశామని, అందులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హతమయ్యాడని అమెరికా బలగాలు తొలుత వాదించాయి. ఆ దాడిలో చిన్నారులు సహా సాధారణ పౌరులే ప్రాణాలు కోల్పోయారన్న వార్తలను ఇన్నాళ్లూ ఖండించాయి.
ఇదీ చూడండి: US Drone Attack: మా ప్రాణాలంటే లెక్క లేదా?