ETV Bharat / international

'పెన్సిల్వేనియాలో బైడెన్​దే విజయం'

author img

By

Published : Nov 25, 2020, 3:44 PM IST

పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్​ విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. దీంతో బైడెన్​ ఖాతాలోకి మరో 20 ఎలక్టోరల్ ఓట్లు చేరాయి.

Pennsylvania certifies poll results for Biden
'పెన్సిల్వేనియాలో బైడెన్​దే విజయం'

డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ పెన్సిల్వేనియా రాష్ట్రంలో విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్​ టామ్​ ఓల్ఫ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

"నవంబరు 3న అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థులు జోబైడెన్​, కమలాహారిస్​ గెలుపొందారు. ఎన్నికల సిబ్బంది ఎంతో నిబద్ధత, పారదర్శకతతో ఓట్ల లెక్కింపును పూర్తిచేశారు."

-- ట్విట్టర్​లో టామ్​ ఓల్ఫ్​, పెన్సిల్వేనియా గవర్నర్.

మిషిగాన్, జార్జియా రాష్ట్రాల్లోనూ బైడెన్​ విజయం సాధించారు. జో బైడెన్​ ప్రస్తుతం 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించారని, అమెరికా అధ్యక్ష పదవికి కావాల్సిన 270 ఓట్లను అధిగమించారని అమెరికన్​ మీడియా తెలిపింది.

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మాత్రం తన ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్నారు. పెన్సిల్వేనియాలో మళ్లీ లెక్కింపు జరపాలంటూ ట్రంప్ వర్గం దాఖలు చేసిన పిటిషన్​ను కోర్టు ఇదివరకే కొట్టివేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.