అమెరికాలో పదవి నుంచి దిగిపోనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను కత్తిరించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ చివరి రోజుల్లో సైనిక చర్యలకు, అణ్వస్త్ర దాడికి ఆదేశాలివ్వకుండా ఆయనను నిరోధించే అంశంపై అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ.. అత్యున్నత సైనికాధికారి జనరల్ మార్క్ మిల్లేతో చర్చించారు.
"మానసిక స్థితి సరిగా లేని ఈ అధ్యక్షుడి వల్ల దేశానికి చాలా ప్రమాదం. దాదాపు 50ఏళ్ల కిందట నిక్సన్‌ను కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు సాగనంపారు. నేడు కూడా వారు అదే చర్యను చేపట్టి, ట్రంప్‌నకు ఉద్వాసన పలకాలి. ఆయన తనంతట తానుగా వైదొలగకుంటే..తదుపరి చర్యలను కాంగ్రెస్ చేపడుతుంది."
---అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ
స్థిరచిత్తాన్ని కోల్పోయిన అధ్యక్షుడికి అణ్వస్త్ర దాడికి సంబంధించిన రహస్య సంకేతాలను అందుబాటులో లేకుండా చేసే ముందు జాగ్రత్తలపై మార్క్‌తో చర్చించానని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్