ETV Bharat / international

ట్రంప్​ అభిశంసనలో కీలక మలుపు.. ముసాయిదా బిల్లు ఏర్పాటు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనపై ముసాయిదా బిల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అమెరికా కాంగ్రెస్​ దిగువసభ స్పీకర్​ నాన్సీ పెలోసీ. క్రిస్మస్​​ లోపు అభిశంసనపై ఓటింగ్​ జరిపేందుకు డెమొక్రాట్లు ఉత్సాహంతో ఉన్నందున.. పెలోసీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై స్పందించిన ట్రంప్​.. చివరకు తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Pelosi OKs drafting of impeachment articles against Trump
అభిశంసన
author img

By

Published : Dec 5, 2019, 11:02 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనపై కీలక ప్రకటన చేశారు ఆ దేశ కాంగ్రెస్​ దిగువసభ స్పీకర్​ నాన్సీ పెలోసీ. అభిశంసనపై ముసాయిదా బిల్లు​ రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. అధ్యక్షుడు తన సొంత ప్రయోజనాల కోసం ఎన్నికల్లో మరోసారి అవకతవకలకు పాల్పడాలని చూస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

నాన్సీ పెలోసీ

" మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. అధ్యక్షుడు తన సొంత ప్రయోజనాల కోసం మరోసారి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నందున చర్యలు తీసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు."

-నాన్సీ పెలోసీ, దిగువసభ స్పీకర్​

క్రిస్మస్​​ లోపు ట్రంప్​ను అభిశంసన ఓటింగ్​లో ఓడించి.. అధ్యక్ష పదవి నుంచి దింపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారమే డెమొక్రాట్లతో ఏకాంత భేటీ అయ్యారు పెలోసీ. అభిశంసనపై ఓటింగ్​కు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. వారందరూ అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం అభిశంసనపై ముసాయిదా బిల్లు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఉదయం ప్రకటించారు పెలోసీ.

అభిశంసనలో విజయం మాదే..

అభిశంసనపై ముసాయిదా బిల్లు ఏర్పాటు చేసేందుకు స్పీకర్​ నాన్సీ పెలోసీ అంగీకారం తెలపటంపై తనదైన శైలిలో స్పందించారు ట్రంప్​. అభిశంసనలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్​ చేశారు.

impeachment
ట్రంప్​ ట్వీట్​
impeachment
ట్రంప్​ ట్వీట్​

అభిశంసన ఎందుకు

2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన జో బిడెన్​పై దర్యాప్తు చేపట్టాలని.. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్​ ఒత్తిడి తెచ్చారన్న అంశంపై.. అభిశంసన చేపట్టాలని డెమొక్రాట్లు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ కుమారుడు, భార్య ఎంట్రీతో 'అభిశంసన'లో కొత్త ట్విస్ట్

New Delhi, Dec 05 (ANI): While addressing a press conference, Delhi Chief Minister Arvind Kejriwal informed that CCTVs will be installed in 5,500 DTC and cluster buses, 3 in each. "CCTV will be installed in 5,500 DTC and cluster buses, 3 in each. 10 panic buttons and automatic vehicle location system will be set up in each bus. A command centre will be set up for all buses. It'll be helpful in maintaining security of women," said Delhi CM.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.