అమెరికా తూర్పు టెక్సాస్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో చర్చి పాస్టర్ మరణించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే ఏరియా అసుపత్రిలో చేతికి గాయం అయిన వ్యక్తి చికిత్సపొందినట్లు పేర్కొన్న పోలీసులు.. ఆ వ్యక్తి నిందితుడే అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
దీనిపై స్థానిక గవర్నర్ గ్రెగ్ అబోట్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టం అని పేర్కొన్నారు. పట్టుబడిని నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'నాకు ఆ ఓట్లు కావాలి'- జార్జియా అధికారితో ట్రంప్