ETV Bharat / international

'కియా' ఇంజిన్​లో మంటలు.. 3లక్షల కార్లు వెనక్కి

పలు సాంకేతిక కారణాల దృష్ట్యా కియా సంస్థ తాము తాయారు చేసిన 3 లక్షల 80వేల కార్లను తిరిగి వెనక్కి పిలవనుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్​తో అధిక విద్యుత్తు విడుదలై అగ్నిప్రమాదానికి కారణం అవుతోందని తెలిపింది.

Park outside: Kia recalls nearly 308K vehicles for fire risk
ఆ దేశంలో కార్లను వెనక్కి పిలిచిన కియా సంస్థ
author img

By

Published : Mar 9, 2021, 10:14 PM IST

అమెరికాలో తమ కార్లు కొన్న కొంత మంది వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా హెచ్చరించింది. సాంకేతికపరమైన లోపాల కారణంగా ఇంజన్​లో మంటలు వస్తున్నాయని తెలిపిన సంస్థ.. 3 లక్షల 80 వేల కార్లను వెనక్కి పిలిపించింది. ఈ నేపథ్యంలో.. కార్లను ఇంట్లో పార్కు చేయవద్దని.. బయట పెట్టాలని సూచించింది.

సమస్యను పరిష్కరించడానికి స్పోర్టేజ్​ ఎస్​యూవీ వాహనాలను రికాల్​ చేస్తున్నట్లు ప్రకటించింది కియా. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్​తో అధిక విద్యుత్తు విడుదలై అగ్నిప్రమాదానికి దారి తీస్తోందని తెలిపింది. ఆ కార్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది. అయితే కియా స్మార్ట్​ క్రూయిస్​ సిస్టమ్​ను కలిగి ఉన్న వాహనాలకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందుల ఉండవని స్పష్టం చేసింది.

ఈ సమస్య నివారణకు వాహనాదారులు డాష్​బోర్డులో టైర్ ప్రెజర్​, యాంటీ లాక్​ బ్రేక్, ఇతర హెచ్చరిక లైట్లను గమనించడం సహా.. మండుతున్న, కరిగే వాసనలను కూడా పసిగట్టవచ్చని తెలిపింది కియా. ఏప్రిల్​ 30 నుంచి కార్ల ఓనర్లకు నోటీసులు ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 10 నెలల్లోనే ఆ మైలురాయిని అందుకున్న 'కియా'​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.