ETV Bharat / international

ఆటో షోలో ఖరీదైన కార్ల కనువిందు

న్యూయార్క్​ పట్టణంలో అంతర్జాతీయ కార్ల ప్రదర్శన జరుగుతోంది. వెయ్యికిపైగా మోడళ్లను ప్రదర్శనకు ఉంచినట్టు  నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ప్రదర్శన 28 వరకు జరగనుంది. కార్లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.

ఆటో షో
author img

By

Published : Apr 21, 2019, 9:12 AM IST

న్యూయార్క్ నగరంలో "​ఇంటర్నేషనల్ ఆటో షో-2019" కార్ల ప్రేమికుల కళ్లు చెదిరేలా అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలకు చెందిన మోడళ్లు ఈ ప్రదర్శనలో సందడి చేస్తున్నాయి.

దాదాపు వెయ్యికిపైగా యుటిలిటీ కార్ల మోడళ్లు ప్రదర్శనలో ఉన్నాయి. అందులో ఎక్కువ ఎస్​యూవీలేనని నిర్వాహకులు తెలిపారు.

మెర్సిడెస్​ బెంజ్​కు చెందిన పూర్తిగా విద్యుచ్ఛక్తితో పని చేసే 2020 ఈక్యూసీ ఎస్​యూవీ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో ధ్వనితో నియంత్రించే ప్రత్యేక ఫీచర్​ సందర్శకులను ఆకర్షిస్తోంది.

ఆటో ప్రదర్శనలు మీడియాను మాత్రమే కాదు... సగటు వినియోగదారులను ఆకర్షించేందుకు కూడా వేదికగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"ఎస్​యూవీల్లో విభిన్న ఆకృతుల కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అమెరికన్లు ఎక్కువగా ఇప్పుడు వాటినే ఇష్టపడుతున్నారు." -కాల్డ్ వెల్​, విశ్లేషకురాలు.

ఈ నెల 19 నుంచి 28 వరకు ఆటోషో జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

New Delhi, Apr 20 (ANI): Smita Vats Sharma, Additional Director General (PR) from Ministry of Railways updated on the unfortunate derailment of Howrah-New Delhi Poorva Express Rooma village in Kanpur on Saturday. Sharma said, "No casualties, no serious injuries have been reported. All the passengers have been evacuated. Accident Relief Train (ART) and Accident Relief Medical Equipment (ARME) dispatched to the accident site. The main route has been impacted due to derailment."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.