ETV Bharat / international

పాక్​ కుతంత్రానికి మరోసారి ఎదురుదెబ్బ - భారత్​పై పాక్ కుట్రను తిప్పికొట్టిన ప్రపంచ దేశాలు

ఐక్యరాజ్య సమితిలో భారత్​ను​ ఇరకాటంలో పెట్టాలనే పాకిస్థాన్ కుట్ర మరోసారి బెడిసికొట్టింది. నలుగురు భారతీయులకు అల్​ఖైదాతో సంబంధాలు ఉన్నాయంటూ ఓ జాబితాను '1267 అల్​ఖైదా శాంక్షన్​ కమిటీ'కి సమర్పించింది పాక్​. నిరాధారమైన ఆ జాబితాను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలు తిరస్కరించాయి.

Pak conspiracy for Indians to have links with militants
ఐరాస భద్రత మండలిలో పాక్​కు ఎదురుదెబ్బ
author img

By

Published : Sep 3, 2020, 11:35 AM IST

ఐక్యరాజ్య సమితి నిబంధనలను తన స్వప్రయోజనాలకు వినియోగించుకుని తద్వారా భారత్​ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఐరాస భద్రతా మండలి ఈ కుతంత్రాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది.

ఉగ్రసంస్థ అల్​ ఖైదాతో నలుగురు భారతీయులకు సంబంధాలు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలతో ఓ జాబితాను ఐరాస భద్రతామండలికి చెందిన '1267 అల్​ఖైదా శాంక్షన్​ కమిటీ'కి పాకిస్థాన్​ సమర్పించింది. అంగర అప్పాజీ, గోబింద పట్నాయక్, అజోయ్ మిస్త్రీ, వేణుమాధవ్ దొంగర పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఎటువంటి ఆధారాలు చూపని ఆ జాబితాలను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలు తిరస్కరించాయి.

రెండుల నెలల క్రితం కూడా అజోయ్ మిస్త్రీ, వేణుమాధవ్ దొంగర పేర్లను ఇలానే అల్​ఖైదా జాబితాలో చేర్చరేందుకు పాకిస్థాన్ ప్రయత్నించి విఫలమయ్యింది. బుధవారం మరో ఇద్దరి పేర్లను జోడించి సమర్పించిన జాబితా కూడా గతంలో మాదిరిగానే తిరస్కరణకు గురైందని ఐరాసలో భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి తెలిపారు.

ఇదీ చూడండి:ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.