ETV Bharat / international

ఉగ్రసంస్థల నేతల్లో పాక్​ వాసులే ఎక్కువ: ఐరాస - un on pak leadership of terrorism

మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేసే ఉగ్రవాదంలో.. పాకిస్థాన్​దే కీలక పాత్ర అని ఉద్ఘాటించింది ఐక్యరాజ్యసమితి. ముష్కర మూకల నాయకత్వ స్థానాల్లో ఎక్కువగా పాక్ వాసులే ఉన్నట్లు పేర్కొంది. అల్​ఖైదా, ఖొరాసన్, పాక్ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ అగ్రనేతల్లో ఎక్కువభాగం దాయాది పౌరులే ఉన్నారని స్పష్టం చేసింది ఐరాస.

uno
ఉగ్రసంస్థల నేతల్లో పాక్​ వాసులే ఎక్కువ: ఐరాస
author img

By

Published : Jul 26, 2020, 1:08 PM IST

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్​‌ ప్రభుత్వ పాత్రపై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంలో పాక్ వాసుల పాత్రపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) విడుదల చేసిన నివేదిక మరిన్ని వాస్తవాలను బయటపెట్టింది.

అల్‌ఖైదా విభాగం, ఇరాక్‌లోని ఐసిస్‌ ఉగ్ర సంస్థల్లో... పాక్ దేశస్థులు నాయకత్వ స్థానాల్లో ఉన్నారని వెల్లడించింది ఐరాస. అఫ్గానిస్థాన్‌లో ఆ దేశ సైన్యం అరెస్టు చేసిన ఐఎస్ఐఎల్​కే ఉగ్ర సంస్థ అధినేత అస్లాం ఫరూకీ, అతని కంటే ముందు బాధ్యతలు నిర్వహించిన జియా ఉల్‌హక్‌.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ఫక్తుంఖ్వా ప్రాంతానికి చెందిన వారని స్పష్టం చేసింది.

ఈ ఏడాది మార్చిలో కాబూల్‌ గురుద్వారాలో జరిగిన ఉగ్రదాడికి అస్లాం ఫరూకీ సూత్రధారి అని తెలిపింది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఈ నివేదిక.. కేరళ, కర్ణాటకలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో ఐసిస్‌ ఉగ్రవాదులు ఉన్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి: ప్రచ్ఛన్న యుద్ధం 2.0: ప్రపంచ శక్తుల పునరేకీకరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.