అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్ సహా ఆ దేశ నిఘా వర్గాలు కీలక పాత్ర పోషించాయని అమెరికాలో రిపబ్లికన్ చట్టసభ సభ్యుడు స్టీవ్ చాబొట్ వ్యాఖ్యానించారు. తాలిబన్ల విజయంపై పాక్ సంబరాలు చేసుకోవడం అసహ్యంగా ఉందని అన్నారు.
హిందూ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చాబొట్. అఫ్గానిస్థాన్‌లో మైనార్టీలుగా(Afghanistan minority groups) ఉన్న సిక్కులు, హిందువులకు భారత్ స్వాగతం పలకడాన్ని ఆయన మెచ్చుకున్నారు.
"పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడుల అంశం పెద్దగా అమెరికా ప్రజల దృష్టికి రావడం లేదు. వీటిపై అమెరికా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హింస.. అపహరణలు, బలవంతంగా ఇస్లాంలోకి మార్చటం, హిందూ బాలికలను వృద్ధ ముస్లిం పురుషులతో బలవంతంగా వివాహం జరిపించటం వంటి హేయమైన పనులు సాగుతున్నాయి. మైనర్లను తమ కుటుంబం నుంచి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నట్లు చాలా మీడియా సంస్థలు, హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అయితే.. వాటిని పట్టించుకోకపోవటం బాధాకరం."
- స్టీవ్ చాబొట్, రిపబ్లికన్ చట్టసభ్యుడు
అమెరికాలో 60 లక్షల మంది హిందువులు ఉన్నారని, అమెరికాలో వారూ ఒక భాగమన్నారు చాబొట్. పని పట్ల నిబద్ధత, ఉన్నత విద్యా సాధన ద్వారా హిందువులు అమెరికన్ కలలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. దేశంలో హిందువులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అందువల్లే వారిపై వివక్ష చూపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వివక్షకు అమెరికాలో స్థానం లేదన్నారు.
ఇదీ చూడండి: Afghanistan Ghost Soldiers: బైడెన్ 'ఆత్మ'ల లెక్కల వల్లే అఫ్గాన్ ఇలా...
తాలిబన్ల మెరుపు వేగానికి కారణం.. ఈ దళం!