ETV Bharat / international

అధ్యక్ష పోరు: రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్​ - టెక్సాస్​ ముందస్తు పోలింగ్​

అమెరికాలో ముందస్తు పోలింగ్​ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టెక్సాస్​లో ప్రజలు ఈ సదుపాయాన్ని భారీగా వినియోగించుకుంటున్నారు. ఈ నెల 13న ఈ ప్రక్రియ మొదలవ్వగా.. ఇప్పటికే 70 లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారు. ఈసారి నమోదయ్యే పోలింగ్​ శాతం.. ఈ శతాబ్దానికే రికార్డుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Over 7 million voted early in Texas, Harris to campaign Friday
అధ్యక్ష పోరు: రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్​
author img

By

Published : Oct 26, 2020, 9:01 AM IST

అమెరికాలో నవంబర్​ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ముందస్తు పోలింగ్​ కూడా జోరుగా సాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేకమంది ప్రజలు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా టెక్సాస్​లోని ఓటర్లు భారీగా తరలివెళ్లి ఓట్లు వేస్తున్నారు.

శతాబ్దానికే రికార్డు..!

టెక్సాస్​లో ఈ నెల 13న ముందస్తు పోలింగ్​ మొదలైంది. అతి తక్కువ రోజుల్లోనే రికార్డు స్థాయిలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇప్పటివరకు 7మిలియన్​ ఓట్లు పోల్​ అయ్యాయి. ఇది ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 43శాతం. దీంతో టెక్సాస్​లో మొత్తం పోలింగ్​ శాతం.. ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:- అమెరికా ఓటర్లకు ఇరాన్​ 'ఈమెయిల్​'​ బెదిరింపులు!

ఆదివారం నాటికి 25,658మంది ఓట్లు వేశారు. 560 మెయిల్​ బ్యాలెట్లు అందాయి. మరోవైపు ఒక్క హ్యారిస్​ కౌంటీలోనే 10,90,445మంది బ్యాలెట్​ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గెలుపెవరిది?

1970 దశకం నుంచి రిపబ్లికన్లకు టెక్సాస్​ కంచుకోట. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 2016లో ఇక్కడ భారీ స్థాయిలో విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితులు మారతాయని డెమోక్రాట్లు ఆశిస్తున్నారు. మెయిల్​-ఇన్​ ఓటింగ్​పైనే తమ ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి:- అమెరికా ఓటరు ఎటువైపు? 'విజేత'పై ఉత్కంఠ..

ఓటర్ల మాటేంటి?

టెక్సాస్​ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారనే అంశం మీద క్విన్నిపైక్​ విశ్వవిద్యాలయం ఓ సర్వే నిర్వహించింది. ఈ నెల 16-19 మధ్య జరిపిన ఈ సర్వేలో.. ముందస్తు పోలింగ్​ సదుపాయాన్ని ఉపయోగించుకున్న ప్రజలు.. డెమోక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​కే తమ మద్దతు తెలిపే అవకాశమున్నట్టు తేలింది. 48శాతం మంది బైడెన్​కు.. 46శాతం మంది ట్రంప్​నకు మద్దతిచ్చినట్టు సర్వే వెల్లడించింది.

అయితే ఎన్నికల రోజున ఓటు వేయాలనుకుంటున్న వారు మాత్రం ట్రంప్​ వైపే ఉన్నట్టు సర్వే స్పష్టం చేసింది. 62శాతం మంది ట్రంప్​నకు.. 32శాతం మంది బైడెన్​కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.

ఇదీ చూడండి:- 'భారత్​కు మిత్రుడెవరో, శత్రువెవరో తేలిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.