సరిహద్దుల్లోని డిటెన్షన్ కేంద్రాల్లో వలసదారులతో నెలకొన్న రద్దీ పరిస్థితుల తీవ్రతను తెలపడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం తొలిసారిగా జర్నలిస్టులకు అనుమతినిచ్చింది. అక్కడ 4000 పైగా వలసదారులతో నిర్బంధ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి. పిల్లలతో సహా కుటుంబాలు నిర్బంధ కేంద్రాల్లోకి ప్రవేశించారు. ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నారు.
అమెరికా, మెక్సికో సరిహద్దుకు గత వారంలో వేలకొలది వలస కుటుంబాలు చేరుకున్నాయి. వలసల పారదర్శకతపై బైడెన్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో టెక్సాస్, డొన్నాలోని డిటెన్సన్ కేంద్రంలో సదుపాయాల పారదర్శకత కోసం సరిహద్దు భద్రతా, కస్టమ్స్ అధికారులు ఇద్దరు జర్నలిస్టులకు అనుమతినిచ్చారు. 250 మంది మాత్రమే ఉండగలిగే కేంద్రాల్లో దాదాపు 4,100 మంది వలసదారులు ఉన్నారు.
పిల్లలను ఆరోగ్య సేవల విభాగం అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోకి తీసుకురావడానికి ముందు గుడారాల్లో ఉంచుతున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం పిల్లలను చిన్న గదుల్లోకి తీసుకుపోతున్నారు. కరోనా లక్షణాలు ఉంటే తప్పా కొవిడ్ పరీక్షలు నిర్వహించట్లేదు. ఆత్మహత్య చేసుకోవడం వంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అని నర్సులు మానసిక పరీక్షలు చేస్తున్నారు. మరో గదికి తీసుకెళ్లి ఇమ్మిగ్రేషన్ కోర్టుకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు. వలస పిల్లల బంధువులెవరైనా అమెరికాలో ఉంటే వారితో ఫోన్లో మాట్లాడిస్తున్నారు. పిల్లల ఆరోగ్య నివేదిక సూచించే బార్కోడ్ ఉన్న బ్రాస్లెట్ను ఇస్తున్నారు. ప్రతిరోజు 250 నుంచి 300 మంది పిల్లలకు పైగా సరిహద్దు దాటుతున్నారని రియో గ్రాండే లోయలో సరిహద్దు పెట్రోలింగ్ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇదీ చదవండి: మయన్మార్‌తో అమెరికా ట్రేడ్ డీల్ రద్దు