అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. తన ఏజెన్సీ సమీక్షా బృందాల్లో (ఏఆర్టీ) 20 మందికిపైగా భారతసంతతి వ్యక్తులను నియమించారు. ఇందులో ముగ్గురు టీం లీడర్లు కూడా ఉన్నారు. ఈ బృందాలు అధికార బదిలీ ప్రక్రియలో కీలక కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
ఇంతవరకు నియమించిన ఏఆర్టీల్లో ఈ బృందాలే వైవిధ్యమైనవని బైడెన్ ట్రాన్సిషన్ టీం వెల్లడించింది. వందల మంది ఏఆర్టీ సభ్యుల్లో సగం మంది మహిళలే. మిగిలిన మొత్తంలో సుమారు 40 శాతం మంది దివ్యాంగులు, నల్లజాతీయులు, ఎల్జీబీటీక్యూ వంటి ప్రభుత్వంలో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాలకు చెందినవారు ఉన్నారు.
టీం లీడర్లు వీరే..
బైడెన్ ఏఆర్టీ బృందాల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు టీం లీడర్లుగా ఉన్నారు. అరుణ్ ముజుందార్ (విద్యుత్ శాఖ), రాహుల్ గుప్తా (జాతీయ ఔషధ నియంత్రణ), కిరణ్ అహూజా (అధికారుల నిర్వహణ కార్యాలయం) ఈ జాబితాలో ఉన్నారు.
అధికార బదిలీకి ఏర్పాట్లు..
ఈ బృందాలు ప్రతి సంస్థ, శాఖలోని కార్యకలాపాలను అర్థం చేసుకుని.. అధికార బదిలీ సజావుగా జరిగేలా చూస్తాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కేబినెట్ మొదటి నుంచి బాధ్యతలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాయి.
ఇదీ చూడండి: అంతులేని యుద్ధాలకు బైడెన్ స్వస్తి చెబుతారా!