కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి ఏడు లక్షలకు పైగా కేసులు(World Covid cases) వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో ఏకంగా 10 వేల మందికి పైగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 1.43 లక్షల కేసులు(US covid cases) నమోదయ్యాయి. 660 మంది చనిపోయారు.
డెల్టా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ(Food and Drug Administration) కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు, బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోసు(Covid Booster Dose) ఇవ్వాలని సూచించింది. అమెరికాలోని 3 శాతం మంది జనాభా అదనపు డోసుకు అర్హులని అధికారులు తెలిపారు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.
బ్రిటన్
బ్రిటన్‌లో కొత్తగా 33,074 కరోనా కేసులు బయటపడ్డాయి. జులై 23 తర్వాత నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. డెల్టా వేరియంట్(Delta Variant) కారణంగా పెరుగుదల నమోదైందని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్‌లోని 60 శాతం జనాభా రెండు డోసులు(Britain Vaccination) తీసుకోగా.. మిగిలిన వారికి సైతం వీలైనంత వేగంగా టీకాలు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు. కరోనా నిబంధనలను పాటించకపోతే మరో తీవ్రమైన కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం న్యూసౌత్‌వేల్స్‌లో కరోనా కేసులు(New South Wales outbreak) రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 390 మంది వైరస్ బారిన పడ్డట్లు నిర్ధరణ అయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇన్ఫెక్షన్ రేటు కొద్దిరోజుల పాటు అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని అయిన సిడ్నీలో జూన్ 26 నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. ఆగస్టు 28 నాటికి వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుందని భావిస్తోంది.
ఇరాన్లో 39 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 568 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 43,20,266కు చేరగా.. మరణాల సంఖ్య 96,215కు పెరిగింది.
వివిధ దేశాల్లో కరోనా ముఖచిత్రం ఇలా...
దేశం/ప్రపంచం | మొత్తం కేసులు | కొత్త కేసులు | మొత్తం మరణాలు |
---|---|---|---|
ప్రపంచం | 20,61,81,005 | 7,12,227 | 43,47,167 |
అమెరికా | 3,72,03,649 | 1,43,537 | 6,36,298 |
ఇరాన్ | 4,320,266 | 39,049 | 96,215 |
బ్రెజిల్ | 20,285,067 | 35,891 | 566,988 |
బ్రిటన్ | 6,179,506 | 33,074 | 1,30,701 |
ఫ్రాన్స్ | 6,398,983 | 28,554 | 1,12,487 |
ఇండోనేసియా | 3,774,155 | 24,709 | 1,13,664 |
థాయ్‌లాండ్ | 8,39,771 | 22,782 | 6,942 |
మెక్సికో | 30,20,596 | 22,711 | 2,46,203 |
టర్కీ | 60,18,485 | 22,261 | 52,703 |