ETV Bharat / international

కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు - gun shoot in arizona america

ఓ దుండగుడు 90 నిమిషాల వ్యవధిలో మూడు పట్టణాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. అమెరికా ఆరిజోనాలో ఈ ఘటన జరిగింది.

shootings, gun firing
ఫైరింగ్స్​, షూటింగ్​, గన్​
author img

By

Published : Jun 18, 2021, 9:20 AM IST

Updated : Jun 18, 2021, 10:10 AM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆరిజోనాలోని వెస్ట్‌ ఫోనిక్స్‌ ప్రాంతంలో ఓ దుండగుడు జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. 90 నిమిషాల వ్యవధిలో దుండగుడు మూడు పట్టణాల్లో.. కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

కాల్పుల ఘటనపై.. పియోరియా, సర్‌ప్రైజ్‌, గ్లెండెల్‌ పోలీసులు విభాగాలు ఎఫ్​బీఐ, ఆరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీతో కలిసి దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆంక్షలున్నా..

అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. క్లబ్బులు, మాల్స్ వంటి ప్రదేశాల్లో దుండగులు ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో తుపాకీ వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్​ ఏప్రిల్​ నెలలో​ కీలక ప్రకటన చేశారు. సీరియల్​ నంబర్లు లేనివి, నాటు తుపాకుల వినియోగాన్ని కట్టడి చేసేలా వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. అమెరికాలో కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి: అమెరికాలో పేలిన తుపాకీ.. ఒకరు మృతి

ఇదీ చూడండి: చికాగోలో దారుణం- మూడేళ్ల బాలుడి తలపై కాల్పులు

Last Updated : Jun 18, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.