Omicron Variant News: ఒమిక్రాన్ వేరియంట్ 63 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కరోనా రెండ దశలో విధ్వంసం సృష్టించిన డెల్టా వేరియంట్‌ను ఇది త్వరలోనే అధిగమించవచ్చని అంచనా వేసింది.
కొత్త వేరియంట్ ఇంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో ఇంకా తెలియదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం డెల్టా కంటే ఈ వేరియంట్ తక్కువ ప్రమాదకారి అని అభిప్రాయపడింది. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని తెలిపింది.
ఇదీ చదవండి: