ETV Bharat / international

Omicron Antibodies: యాంటీబాడీలతో ఒమిక్రాన్​కు చెక్​! - booster dose effective against omicron

Omicron Antibodies: ఒమిక్రాన్​తో పాటు ఇతర కొవిడ్​ వేరియంట్లను నిరోధించే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి శరీరంలోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కరోనావైరస్ పరివర్తనం చెందకుండా పని చేస్తున్నట్లు తెలిపారు.

Omicron Antibodies
Omicron Antibodies
author img

By

Published : Dec 29, 2021, 10:48 PM IST

Omicron Antibodies: ఒమిక్రాన్​, కరోనా ఇతర వేరియంట్లను నిరోధించే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కరోనావైరస్ పరివర్తనం చెందకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు అమెరికాకు చెందిన వాషింగ్టన్​ స్కూల్ ఆఫ్​ మెడిసిన్​ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నేచర్​ జర్నల్​లో ప్రచురించారు.

స్పైక్ ప్రోటీన్​ లక్ష్యంగా చేసుకుని పోరాడే యాంటీబాడీలపై దృష్టి సారించడం ద్వారా వైరస్ నిరంతర పరిణామాన్ని అధిగమించేందుకు మార్గం సుగమవుతుందని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్​ డేవిడ్ వీస్లర్​ అన్నారు. ఈ పరిశోధన సమర్థమైన టీకాలు, యాంటీబాడీ చికిత్సలను రూపొందించడంలో దోహదపడుతుందన్నారు. తద్వారా ఒమిక్రాన్​తో పాటు భవిష్యత్తులో ఉద్భవించే ఇతర కరోనా వేరియంట్లను సైతం ప్రభావంతంగా ఎదుర్కొవచ్చని అభిప్రాయపడ్డారు.

ఒమిక్రాన్..​​ స్పైక్​ ప్రోటీన్‌లోని ఉత్పరివర్తనాల కూటమి కణాలతో ఎలా అంటిపెట్టుకుని ఉంటుంది? రోగనిరోధక వ్యవస్థను ఏవిధంగా ఏమారుస్తుంది? అనే ప్రధాన విషయాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేసినట్లు వీస్లర్​ తెలిపారు. ఈ పరిశోధనకు వైరస్​ మునపటి వేరియంట్లు సోకిన రోగులు, కొవిడ్​ బారిన పడకముందు టీకా తీసుకున్నవారు, సోకిన తర్వాత టీకాలు వేసినవారి యాంటీబాడీలు ఉపయోగించారు. బూస్టర్​ డోసు తీసుకున్నవారిలో ఒమిక్రాన్​ వేరియంట్​తో యాంటీబాడీలు ఏ మేరకు పోరాడాయో పరిశీలించారు. ఒమిక్రాన్​ వేరియంట్​.. ఏసీఈ2 గ్రాహకాలను సమర్థంగా బంధించగలదని పరిశోధనలో తేలింది.

పరిశోధనలో ముఖ్యాంశాలు

  • ఒమిక్రాన్‌ను నిరోధించే సమర్థమైన నాలుగు రకాల యాంటీబాడీలను గుర్తించారు.
  • ఇవి ప్రతి నాలుగు నిర్దిష్ట ప్రాంతాలకుగానూ ఒక ప్రాంతంలో ఒమిక్రాన్, ఇతర కొవిడ్​ వేరియంట్లు లక్ష్యంగా పోరాడుతాయి.
  • సోట్రోవిమాబ్ అనే యాంటీబాడీ.. ఒమిక్రాన్​ను రెండు నుంచి మూడు రెట్లు తగ్గిస్తుంది. ఇవి కొవిడ్ వేరియంట్లలో ఉన్న స్పైక్ ప్రోటీన్‌లోని నాలుగు నిర్దిష్ట ప్రాంతాల్లో ఒకదానిని లక్ష్యంగా చేసుకుని పోరాడుతాయి.
  • పలు కొవిడ్​ వేరియంట్లు సురక్షితంగా ఉండే ప్రాంతాలను గుర్తించడం ద్వారా వాటిని యాంటీబాడీలు నిరోధిస్తాయి.
  • కొవిడ్​ సోకిన తర్వాత వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల ఒమిక్రాన్​ను సమర్థంగా ఎదుర్కొవచ్చు.
  • బూస్టర్ డోసు ఒమిక్రాన్​పై సమర్థంగా పని చేస్తుంది.

ఇదీ చూడండి: ప్రపంచంపై మరోసారి కరోనా పంజా- వారంలోనే 11% పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.