ETV Bharat / international

అమెరికాలో 95శాతం ఒమిక్రాన్​ కేసులే.. ఫ్రాన్స్​లో రికార్డు స్థాయిలో.. - ఒమిక్రాన్​ వేరియంట్​

America covid cases: అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 95శాతానికిపైగా ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులేనని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన సంస్థ పేర్కొంది. గత ఏడాదిలో విజృంభించిన డెల్టా మారిదిరిగానే ఒమిక్రాన్​ పంజా విసురుతోందని పేర్కొంది. మరోవైపు.. ఫ్రాన్స్​లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే 2.71 లక్షల కొత్త కేసులు వచ్చాయి. బ్రిటన్​, ఇటలీ, స్పెయిన్లలోనూ లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి.

Omicron
కరోనా కేసులు
author img

By

Published : Jan 5, 2022, 9:29 AM IST

America covid cases: కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.67 లక్షల మందికి వైరస్​ సోకింది. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్షకుపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోగులతో నిండిపోయి.. పడకలు దొరక్క రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.

95 శాతం కేసులు ఒమిక్రాన్​వే..

America Omicron variant: అమెరికాలో వైరస్​ బారినపడుతున్న వారిలో 95శాతం కేసులు ఒమిక్రాన్​ వేరియంట్​వే ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు. కొవిడ్​-19 వైరస్​లల్లో ఏ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతునే అంశాన్ని పరిశీలించిన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ).. ఈ మేరకు తెలిపింది. గత ఏడాది జూన్​లో కొత్త కేసులకు డెల్టా వేరియంట్​ కారణంగా కాగా.. నవంబర్​తో తగ్గిపోయినట్లు పేర్కొంది. తాజాగా.. ఒమిక్రాన్​ వేరియంట్​ ఆ స్థానాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

మరోవైపు.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ. లక్షణాలు లేని కేసులే ఎక్కువగా ఉన్న ప్రస్తుత సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిపై దృష్టిసారించటం సరైనదని పేర్కొన్నారు. అయితే, కొందరు నిపుణులు దీనిని వ్యతిరేకించారు. కేసులు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా అమెరికాలో రోజుకు సగటున 4.80 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాయన సంస్థలు సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి.

గత వారం రోజుకు సగటున 14,800 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు వారంతో పోలిస్తే 63 శాతం అధికం. అయితే, గత ఏడాది గరిష్ఠ స్థాయి 16,500లో పోలిస్తే కాస్త ఊరట కలిగించే విషయం. గత రెండు వారాలుగా మరణాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది జనవరి(3,400)తో పోలిస్తే.. ప్రస్తుతం రోజుకు సగటున 1,200 మరణాలు సంభవిస్తున్నాయి.

ఫ్రాన్స్​లో ఒక్కరోజే.. 2.71లక్షల కేసులు

France corona cases: ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఫ్రాన్స్​లో మంగళవారం ఒక్కరోజే ఏకంగా 2,72,686 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్​ వేరియంట్​ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందటమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఆసుపత్రులు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడుతోంది. రవాణా, పాఠశాలలు, ఇతర సేవల విభాగాలపైనా కేసుల నమోదు ప్రభావం చూపుతోంది. అయితే, ఆర్థికంగా దెబ్బతీసే లాక్​డౌన్​కు బదులుగా కరోనా వ్యాక్సిన్​ ఆమోద బిల్లును పార్లమెంట్​ ముందుకు తీసుకురావాలని భావిస్తోంది ఫ్రెంచ్​ ప్రభుత్వం. రోజు వారి సగటు కేసులు ఈ వారంలో రెండింతలు పెరిగాయి.

బ్రిటన్​లో 2.18 లక్షలు..

  • Britain corona cases: బ్రిటన్​లోనూ కరోనా వేగంగా చుట్టేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 2,18,274 మందికి వైరస్​ సోకింది. 48 మంది రమణించగా 50వేల మంది వైరస్​ను జయించారు.

ఇటలీలో 1.70 లక్షలు

  • Italy corona cases: ఇటలీలో మంగళవారం ఏకంగా 1,70,844 కేసులు నమోదయ్యాయి. 222 మంది ప్రాణాలు కోల్పోయారు. 30వేల మంది వైరస్​ను జయించారు. ఒమిక్రాన్​ వేరియంట్​ కారణంగా అధికారులు భావిస్తున్నారు.

స్పెయిన్​లో 1.17లక్షలు

  • Spain corona cases: స్పెయిన్​లో ఒమిక్రాన్​ విజృంభణతో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,17,775 మందికి వైరస్​ సోకింది. 116 మంది మరణించారు. 13వేల మంది వైరస్​ను జయించారు.

అర్జెంటీనాలో 81వేలు

  • Argentina corona cases: అర్జెంటీనాలో 81,210 మందికి కొత్తగా వైరస్​ సోకింది. 49 మంది మరణించారు. 16వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

టర్కీలో..

  • Turkey Covid cases: టర్కీలో మంగళవారం 54,724 వైరస్​ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాకు బలయ్యారు. 26వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 96 లక్షలు దాటింది.

ఇదీ చూడండి: WHO Omicron: 'ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్​'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.